వైరల్ : పవన్ ఫ్యాన్ కి గట్టి షాకిచ్చిన హరీష్ శంకర్.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రాలతో పాటుగా పవన్ రాజకీయాల్లో కూడా ఫుల్ బిజీగా ఉండగా పవన్ సినిమాల విషయానికి వస్తే వాటిలో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న క్రేజీ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి.

మరి ఈ సినిమా అయితే పవన్ జెస్ట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తుండగా ఈ సినిమా కోసం అయితే అంతా ఆసక్తిగా ఉన్నారు. కాగా రీసెంట్ గానే సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కాగా ఈ షూట్ విషయంలో అయితే అత్యుత్సాహంతో ఉన్న ఫ్యాన్ అయితే హరీష్ శంకర్ పై రిప్లై రిప్లై ఇచ్చాడు.

సినిమా షూట్ యాభై శాతం అయిపోయింది అంట కదా క్వాలిటీ బాగా రాదు అది దేవుడు పైనే భారం వేసాం అంటూ రిప్లై ఇచ్చాడు. దీనితో బాగా మండిన హరీష్ శంకర్ మార్క్ స్పార్క్ లాంటి రిప్లై ఇచ్చాడు. షూటింగ్ అంతకు మించే కంప్లీట్ అయ్యిపోయింది. అయితే నువ్వేం చెయ్యగలవ్ చెప్పు?? ఈలోగా నీ కెరీర్, జాబ్, భవిష్యత్తు కోసం దృష్టి పెట్టు వాటిని మాత్రం దేవునికి వదిలేయకు ఆల్ ది బెస్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు.

దీనితో ఈ రేంజ్ లో రిప్లై ఇస్తే ఇక పవన్ ఇతర ఫ్యాన్స్ కి కూడా మాట రాకుండా పోయింది. హరీష్ శంకర్ ని కెలికితే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఇలానే ఉంటుంది. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కే హరీష్ అదిరే అవుట్ ఫుట్ ఇచ్చాడు అలాంటిది ఇప్పుడే తనని జస్టిస్ చేసేయడం కూడా రాంగే అవుతుంది. 
https://x.com/harish2you/status/1704372366846160966?s=20