నిర్మాత అశ్వినీదత్ తాజాగా నంది అవార్డులని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మే 31న మోసగాళ్ళకి మోసగాడు సినిమా రీరిలీజ్ చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇక మే1 కార్మికుల దినోత్సవం కూడా కావడంతో మీడియా వారు ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల గురించి ప్రశ్నించారు.
ఈ సందర్భంగా అశ్వినీదత్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నంది అవార్డులని ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని చెబుతూనే ఇప్పుడు అంతా ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అవార్డులు నడుస్తున్నాయని వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. అయితే ఇవి వైసీపీని ఉద్దేశించి చేసినవే అనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో వైసీపీ పోసాని కృష్ణమురళీ సీరియస్ గా రియాక్ట్ అయ్యి అశ్వినీదత్ మీద విమర్శల దాడి చేశారు.
ఈ విమర్శలతో ఇప్పుడు అశ్వినీదత్ కామెంట్స్ కి మరింతగా రాజకీయ రంగు అంటుకుంటుంది. సినిమాల వేడుకలో రాజకీయాలు గురించి ఎంత తక్కువ ప్రస్తావన ఉంటే అంత మంచింది. గతంలో రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఆ సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించాయి. సినిమా బాగుందనే టాక్ వచ్చిన కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయ్యింది.
ఇప్పుడు అశ్వినీదత్ చేసిన కామెంట్స్ కూడా అలాగే రాజకీయం అయ్యాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ప్రాజెక్ట్ కె ఏకంగా 600 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రాజెక్ట్ కె జనవరి 12న రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పుడు నిర్మాత అశ్వినీదత్ చేసిన కామెంట్స్ ఆ సినిమాకి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందనే మాట టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది.
ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో సరికొత్త కథాంశంతో ఆదిపురుష్ మూవీ రాబోతోంది. అలాంటి భారీ చిత్రాన్ని అడ్వాన్స్ టెక్నాలజీ మూవీని టాలీవుడ్ నుంచి తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కె మూవీ తెలుగు వారికి గర్వకారణం అని చెప్పాలి. మరి అలాంటి సినిమాకి ఆటంకాలు సృష్టించే అవకాశం ఉందా అంటే చెప్పలేమనే మాట వినిపిస్తోంది.