బావలు సయ్యా అంటూ నడుమును తిప్పేసింది.. హీరోయిన్ పూర్ణ డ్యాన్స్ వైరల్

Poorna dance in Atto Attamma Kuthuro

అవును సినిమాతో పూర్ణ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పూర్ణ.. బుల్లితెరపై కనిపించి అందరినీ కట్టి పడేసింది. పూర్ణ ఢీ షోలో చేసే అల్లరి, వేసే స్టెప్పుల గురించి అందరికీ తెలిసిందే. పూర్ణ డ్యాన్స్ చేస్తూ అందులో ఓ స్టైల్, ఓ గ్రేస్ ఉంటుంది. ఆ మధ్య ప్రదీప్‌తో, బాబా భాస్కర్‌తో పూర్ణ చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. ప్రదీప్ పూర్ణ అనే ట్రాక్ ఆడ్యాన్స్ పర్పామెన్స్ తరువాత బాగా వైరల్ అయింది.

Poorna dance in Atto Attamma Kuthuro
Poorna dance in Atto Attamma Kuthuro

అయితే తాజాగా పూర్ణ మరోసారి తన వయ్యారాలను తిప్పేసింది. అయితే అది ఢీ స్టేజ్ మీద మాత్రం కాదు. సంక్రాంతి కోసం చేస్తోన్న స్పెషల్ ఈవెంట్‌లో పూర్ణ రెచ్చిపోయింది. అత్తో అత్తమ్మ కూతురో అంటూ రోజాను మెయిన్ లీడ్‌గా పెట్టి ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఇందులో రోజా అత్తగా ఆమె కూతుళ్లుగా అనసూయ, రోహిణి, వర్షలు, అల్లుళ్లుగా ఆది, రామ్ ప్రసాద్, ఇమాన్యుయెల్‌లను పెట్టారు. అలా మొత్తానికి ఓ కాన్సెప్ట్‌తో రాబోతోన్నారు.

అత్తో అత్తమ్మ కూతురో అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో పూర్ణ అందరినీ కట్టిపడేసింది. బావలు సయ్యా అంటూ నాటి సిల్క్ స్మిత స్టెప్పులను పూర్ణ తన స్టైల్లో వేసింది. తన నడుము వయ్యారాలను తిప్పుతూ రచ్చ చేసింది. ఇక ఈ పర్ఫామెన్స్ ఈవెంట్ మొత్తానికి హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమోలో వర్ష, ఇమాన్యుయేల్‌లా రొమాన్స్ అందరినీ ఆకర్షిస్తోంది. ఏది ఏమైనా ప్రతీసారి ప్రతీ పండుగకు కొత్త కాన్సెప్ట్‌తో వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు.