పూనమ్ కౌర్ కి ఇవి కనిపించలేదా.?

టాలీవుడ్ యంగ్ నటి పూనమ్ కౌర్ కి అలాగే స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడు నుంచో కోల్డ్ వార్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి విషయంలో ఏం జరిగిందో ఏమో కానీ ఒకోసారి పూనమ్ అయితే పవన్ ని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తుంది కొన్ని సార్లు పొగుడుతుంది.

అయితే పవన్ విషయంలో ద్వంద్వ వైఖరి చూపించే పూనమ్ లేటెస్ట్ గా పవన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” పై అయితే షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఈ సినిమా పోస్టర్ లో హీరో కాలి కింద స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పేరుని ఎలా పెడతారు అని ఇది తన ఈగో నా లేక నిర్లక్ష్యమా అంటూ పవన్ ని ఎద్దేవా చేసింది.

అయితే దీనికి కౌంటర్ గా పవన్ ఫ్యాన్స్ కూడా రిప్లై లు అయితే ఇచ్చారు. కానీ పవన్ విషయంలోనే కావాలని పూనమ్ టార్గెట్ చేస్తున్నట్టుగా మరో సారి క్లియర్ అయ్యింది అని చెప్పాలి. నెక్స్ట్ పోస్టర్ లో పవన్ తలపైన ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ఉంది.

మరి పూనమ్ కి ఇది కనిపించలేదా అని కొందరు అంటుంటుండగా ఇక ఇట పలు దేవుని ఆధారంగా చేస్తున్న సినిమాలు ఆదిపురుష్, హనుమాన్ లాంటి సినిమా పోస్టర్స్ లో కూడా హీరో కాలి కింద సినిమా టైటిల్స్ లేవా వాటి కోసం ఎందుకు మాట్లాడ్డం లేదని కొందరు అంటున్నారు. దీనితో పవన్ విషయంలో మాత్రమే కావాలనే పూనమ్ టార్గెట్ చేయడానికి వచ్చింది అని గట్టి లాజికల్ కౌంటర్ లు పవన్ ఫ్యాన్స్ అయితే పూనమ్ మీద వేస్తున్నారు.