వైరల్ : పవన్ ని మరోసారి టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.!

ఇప్పుడు టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ల హైప్ లో పవన్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒకో సినిమా నుంచి ఒకో రోజు అదిరే అప్డేట్ అయితే ఈ సినిమాలపై ఇప్పుడు బయటకి వస్తున్నాయి. ఈ చిత్రాల్లో ఈరోజు దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” నుంచి అయితే అప్పుడే ఫస్ట్ గ్లింప్స్ కూడా వచ్చేస్తుంది.

ఇక దీనిపై నిన్న రిలీజ్ చేసిన ఓ పోస్టర్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అయితే దీనిపై ఏ ఒక్కరి నుంచి కూడా ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వినిపించలేదు కానీ లేటెస్ట్ గా నటి పూనమ్ కౌర్ మాత్రం నెగిటివ్ లాజిక్ ని పట్టుకొని ఓ పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే పూనమ్ ఎక్కడా కూడా పవన్ పేరును ప్రస్తావించలేదు కానీ భగత్ సింగ్ అంటూ పవన్ సినిమాపై కామెంట్స్ చేసింది. మన దేశ విప్లవనాయకులని ఇలాగేనా గౌరవిస్తారు. రీసెంట్ గా ఒక పోస్టర్ చూసాను అందులో ఓ వ్యక్తి కాలి కింద భగత్ సింగ్ అనే టైటిల్ ఉంది అంటూ నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ పైనే కామెంట్స్ చేసింది.

దీనితో చాలా రోజుల తర్వాత మళ్ళీ పవన్ విషయంలో పూనమ్ అయితే ఎందుకీ యాక్టీవేట్ అయ్యింది. కానీ ఈ పోస్ట్ ని అయితే ఫ్యాన్స్ కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోనట్టే కామెంట్స్ చేస్తున్నారు. మరి పూనమ్ కి ఎందుకు సడెన్ గా పవన్ ని టార్గెట్ చేయాలి అనిపించిందో మరి అని ఇంకొందరు అనుకుంటున్నారు.