పూజా హెగ్డే దే 2021 లో కూడా టాప్ ప్లేస్ అని ఫిక్సవడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి ..?

పూజా హెగ్డే.. టాలీవుడ్ లో చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్‌. బాక్సాఫీస్ వద్ద బంపర్ వసూళ్లు. ఏ ప్రాజెక్ట్ అయినా పూజా హెగ్డే అడుగుపెట్టనంత వరకే..పెట్టిందా రికార్డుల మోత మోగాల్సిందే అన్నట్లుగా ఉంది బుట్టబొమ్మ లక్. వరుస హిట్ లతో పూజా హెగ్డే అదృష్టం అమాంతంగా పెరిగిపోతోంది. గోపికమ్మగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ నాజూకు సుందరి…అనతికాలంలో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని తన టాలెంత్ తో సొగసరి చూపులతో కుర్రకారు మతులను పోగొట్టింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకుంది.

Allu Arjun and I put our heart and soul into Butta Bomma: Pooja Hegde |  Telugu Movie News - Times of India

ఓ వైపు టాలీవుడ్, మరోవైపు బాలీవుడ్ లో అవకాశాలు ఎటువైపు నుంచి అందివచ్చినా ఏమాత్రం మిస్ చేసుకోకుండా సక్సెస్ ట్రాక్ తో ముందుకు దూసుకెళుతోంది పూజా హెగ్డే. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ను పూజా ఓ ఊపు ఊపుతోంది. గత రెండు సంవత్సరాలుగా అమ్మడి హిట్ ట్రాక్ చూస్తూ అందరూ షాక్ అవ్వాల్సిందే. యంగ్ టైగర్ తో అరవింద సమేత, మహేష్ తో మహర్షి, వరుణ్ తో గద్దలకొండ గణేష్..ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో వంటి క్రేజీ మూవీస్ లో నటించి వరుసగా హిట్‌ లు కొట్టి క్రేజ్ ను అమాంతం పెంచుకుంది.

Aravinda Sametha box office collection: Trivikram film turns highest  grosser for Jr NTR, beating JLK, JG - IBTimes India

టాలీవుడ్ లో సమంత, కాజల్, తమన్నా, రకుల్ తరువాత అంత స్పీడ్ గా స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది అంటే పూజా హెగ్డే నే. టాలీవుడ్ లో పూజాను ఢీకొట్టే తారలు ఉన్నా..బాలీవుడ్ బ్యూటీలు డెబ్యూ అవుతున్నా…ఈ సుందరికి ఛాన్స్ ల వర్షం కురుస్తూనే ఉందని చెప్పాలి. ఓవైపు కీర్తీ సురేష్, రష్మికలు పోటీ పడుతున్నా.. తనకి మాత్రం క్రేజీ ప్రాజెక్ట్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. రీసెంట్ గా అమ్మడు డార్లింగ్ ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమా చేయడంతో పూజా హెగ్డే లెవెలే మారిపోయింది. ఈ మూవీ త్వరలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

On Pooja Hegde's Birthday, Her First Look From Prabhas' Radhe Shyam

దీంతో నాకు నేనే పోటీ…నాకు ఎవరూ రారు సాటి అన్నట్లుగా ఉంది అమ్మడి జోష్. పాన్ ఇండియా సినిమాగా రాధేశ్యామ్ తెరకెక్కుతుండటంతో పూజా హెగ్డే క్రేజ్ ఏ రేంజ్ లో పెరగబోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ సినిమాతో పాటే అఖిల్ కు జోడీగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తోనూ ప్రేక్షకులను అలరించనుంది. వీటితో పాటు బాలీవుడ్ సినిమాలు చేతిలో ఉన్నాయి. ఈ రకంగా చూస్తే పూజా హెగ్డే 2021లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ని రెట్టింపు చేసుకోవడం ఖాయమన్న మాట వినిపిస్తోంది.