ఆ విషయంలో అల్లు అర్జున్‌ అందనంత ఎత్తులో.!

స్టైలిష్ స్టార్ అనే గుర్తింపుని కాదనుకుని.. ఐకాన్ స్టార్‌గా తనకు తాను బిరుదు ఇచ్చేసుకున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. అబ్బే, అది ఫ్లాప్ సినిమా.. అంటారు కొందరు. కానీ, బన్నీ రేంజ్ మారిపోయింది. ‘అల వైకుంఠపురములో’ సినిమా ఇచ్చిన కిక్కు.. ఆ తర్వాత ‘పుష్ప’తో వచ్చిన మైలేజ్.. వెరసి, అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు వేరే లెవల్‌లో వుంది.

ఇక, అల్లు అర్జున్ సక్సెస్ వెనుక అతని అభిమానుల కృషి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా..’ అంటూ చివరికి మెగా కాంపౌండ్ హీరోల్నీ బూతులు తిట్టడానికి వెనుకాడదు అల్లు అర్జున్ ఆర్మీ.

సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కి వున్నంత ‘పెయిడ్ ఆర్మీ’ ఇంకే హీరోకీ లేదనడం అతిశయోక్తి కాదేమో. ఈ విషయంలో అల్లు అర్జున్‌కి టాలీవుడ్ హీరోలెవరూ సాటి రారంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఔనా.? అది నిజమేనా.? అల్లు అర్జున్ వెంట వున్నవాళ్ళంతా పెయిడ్ ‘ఆర్మీ’యేనా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.!