నెల్లూరు మార్కెట్ యార్డ్‌లో నటులు చేసిన వీరంగం వారిని కటకటాల వెనక్కు నెట్టేలా చేసింది. ఏదో చేద్దామనుకుంటే ఏదో అయిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ యార్డ్‌లో కొందరు వ్యక్తులు కత్తులతో హడావిడి చేశారు. కత్తులతో వెంబడిస్తూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ నానా రచ్చ చేశారు. వినియోగదారులు అందరు ఇది చూసి చాలా భయపడ్డారు. ఈ పరిస్థితిని చూసి వణికిపోయిన ప్రజలు వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. అక్కడకు పోలీసులు చేరుకోవడంతో సీన్ పూర్తిగా మారింది.
మార్కెట్ యార్డ్‌లో హల్‌చల్ చేస్తున్న గ్యాంగ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిని విచారించగా షాకింగ్ విషయాలు బయటపెట్టారు. తామంతా జూనియర్ ఆర్టిస్టులమని చెప్పిన గ్యాంగ్ ఇదంతా షార్ట్ ఫిలింస్ కోసం చేస్తున్నామని చెప్డంతో పోలీసులు ఖంగుతిన్నారు. షార్ట్ ఫిలిం షూటింగ్‌లో భాగంగా ఇలా చేసామని అనడంతో కోపోద్రిక్తులైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించాను. తమైదన స్టైల్‌లో విచారించడంతో పూర్తి క్లారిటీ ఇచ్చారు.
మద్రాస్ బస్టాండ్ పేరుతో షార్ట్ ఫిలిం తీస్తున్నామని చెప్పిన ఆ గ్యాంగ్, షూటింగ్‌లో భాగంగా ఇలా వీరంగం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే పోలీసులు పర్మీషన్ తీసుకోవడంతో పాటు అక్కడి ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాతే ఇలా షూటింగ్స్ చేయాలని చెప్పి ఈ ఒక్కసారికి వదిలేశారు. చేతిలో కెమెరా ఉందని ఎక్కడ పడితే అక్కడ షూటింగ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు