భారీగా వసూలు రాబట్టిన పోకిరి స్పెషల్ షో.. ఎన్ని కోట్లో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9వ తేదీ పుట్టినరోజు జరుపుకోవడంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన పోకిరి సినిమాని తిరిగి విడుదల చేశారు.ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా యూఎస్ లో కూడా ప్రత్యేక షోలు వేశారు. ఈ విధంగా మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా విడుదలైన 15 సంవత్సరాల తర్వాత తిరిగి విడుదల చేసినప్పటికీ ఈ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ముందుగా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే టికెట్లు కేవలం గంటల వ్యవధిలోని క్లోజ్ అవడంతో నిర్వాహకులు మరిన్ని థియేటర్లను పెంచారు. ఇలా సుమారు 200 కు పైగా థియేటర్లలో స్పెషల్ షో నిర్వహించగా ఈ సినిమాకి విపరీతమైన ఆదరణ లభించింది.కేవలం ఈ సినిమా మాత్రమే కాకుండా ఒక్కడు సినిమాని కూడా స్పెషల్ షో గా వేశారు.మొత్తానికి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ సినిమాలు తిరిగి విడుదల కావడం విశేషం.

ఈ విధంగా ఈ రెండు సినిమాలు విడుదలై ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టాయి.పోకిరి సినిమా మాత్రమే మూడు కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టగా ఒక్కడు సినిమా కూడా సుమారు 60 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని సమాచారం. ఇకపోతే ఒక్కడు సినిమాని చిత్రబృందం కూడా తిరిగి థియేటర్లో వీక్షించడం విశేషం.ఏదిఏమైనా ఎవరు ఊహించని విధంగా ఇలా మహేష్ బాబు సినిమా కలెక్షన్లను రాబట్టడంతో ముందు ముందు మరి కొంతమంది హీరోల సినిమాలు కూడా ఇలా విడుదలవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.