Kashmir files: ప్రధాని మెచ్చిన కాశ్మీర్ ఫైల్స్…అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రం ఒక చరిత్ర..!

Kashmir files : కాశ్మీర్ ఫైల్స్ ఇపుడు ఇండియాను ఆలోచింపచేస్తున్న చిత్రం. ప్రధాని నుండి సాధారణ పౌరుడి వరకు అందరు చూసి మెచ్చుకుంటున్న చిత్రం. చిన్నగా మొదలై పెద్ద సినిమాలకు పోటీగా దూసుకెళ్తున్న సినిమా. రాధే శ్యామ్ విడుదలైన మార్చి 11 న విడుదలై ఈ సినిమా అంచనాలను తారుమారు చేస్తూ కలెక్షనల వర్షం కురిపిస్తోంది.

ఇక కలెక్షన్ల పరంగానే కాకుండా మరోవిధంగా కూడా ఈ సినిమా చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. అది ఏంటంటే.. సాధారణంగా సాధువులు.. నిత్యం ధ్యానంలో ఉంటారు. దేవుడిని స్మరిస్తూ ఆయన సేవలోనే నిమగ్నమై ఉంటారు. వారి బయట ప్రపంచం గురించి పట్టింపు ఉండదు.. అయితే చరిత్రలో మొట్ట మొదటిసారి సాధువులు థియేటర్ల బాట పట్టారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను సాధువులు వీక్షించారు. ప్రస్తుతం సాధువులు సినిమా వీక్షించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సాధువులు మొదటిసారి థియేటర్ కి వచ్చి సినిమా చూడడం.. ఈ సినిమా చేసుకున్న అదృష్టం.. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా కాదు.. ఒక విప్లవం అంటూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రధాని మోడీ కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే. 1990లో కశ్మీర్‌ పండిట్‌ల పై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా రికార్డుల కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇక ఈ ఫోటోను వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా షేర్ చేయడం విశేషం. ఈ సినిమాపై వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. బాలీవుడ్ ని వివేక్ వుడ్ గా మారుస్తున్నానని, కమర్షియల్ గా విజయం సాధించడం కంటే కొత్త తరం ఫిల్మ్ మేకర్స్ రావడం అనేది ఎంతో గొప్ప విజయం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి.