పాయల్ రాజ్‌పుత్‌కు కరోనా టెస్ట్.. అలా చేయడంతో దెబ్బకు అరిచింది!!

Payal Rajput Test Corona Negative

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ ఓ రేంజ్‌లో సక్సెస్ కొట్టేసింది పాయల్ రాజ్‌పుత్. అయితే మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ కొట్టలేక పాయల్ తెగ ప్రయాస పడుతోంది. ఆపై వచ్చిన ఆర్‌డీఎక్స్ లవ్, డిస్కోరాజా, వెంకీ మామ చిత్రాలు పాయల్‌కు ఏ మాత్రం కలిసి రాలేదు. అయినా సరే మళ్లీ ఓ సక్సెస్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ అమ్మడికి లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌లు కూడా భారీగానే వస్తున్నాయి.

Payal Rajput Test Corona Negative
Payal Rajput Test Corona Negative

అయితే పాయల్‌కు ప్రస్తుతం తెలుగులోనే ఎక్కువ ప్రాజెక్ట్‌లు చేస్తుండటం.. హైద్రాబాద్‌లోనే ఎక్కువగా ఉండాల్సి వస్తుండటంతో ఇక్కడే ఓ ఇల్లు కూడా తీసుకుందట. ఈ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఆన్ లైన్‌లోనే బుక్ చేసిందట. ఆ వస్తువులను కొనడానికి వెళ్తే షాపింగ్ కాంప్లెక్స్‌లో అందరూ చుట్టుముట్టేయడంతో ఈ నిర్ణయం తీసుకుందట. ఈ మధ్యే ఓ ప్రభుత్వ ప్రకటనలో నటించింది పాయల్. ఈ ప్రకటనలో మొదటిసారిగా తెలుగు డబ్బింగ్ చెప్పడంతో మురిసిపోయింది.

Payal Rajput Test Corona Negative
Payal Rajput Test Corona Negative

అయితే తాజాగా ఈ అమ్మడు ముంబై హైద్రాబాద్ అంటూ ప్రయణాలు చేస్తోంది. అందుకే షూటింగ్ సెట్‌లోనే ఈ సుందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో భాగంగా శాంపిల్స్ తీసుకుంటున్న సమయంలో చిన్న పిల్లలా అరిచేసింది. ఇక ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. అదృష్టవశాత్తు కరోనా నెగెటివ్ అని వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. ఇక శాంపిల్స్ తీసుకుంటున్న సమయంలో పాయల్ అరవడంపై నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.