అలాంటివి ఇక ఆపండి.. పాయల్ పాప బాగానే హర్టైంది!!

Payal Rajput Reacts On Talking ABout Her Corona Tests

ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గత రెండు మూడు రోజులుగా తెగ వైరల్ అవుతోంది. తెలుగులోనే ఎక్కువ ప్రాజెక్ట్‌లు చేస్తుండటంతో ఈ అమ్మడు హైద్రాబాద్‌కు షిఫ్ట్ అయింది. అయితే మధ్యలో ముంబైకి కూడా వెళ్లి వచ్చింది. మళ్లీ అక్కడి నుంచి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగ్‌లో ప్రత్యక్షమైంది. అయితే ఎందుకైనా మంచిదని సెట్‌లోనే పాయల్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు.

Payal Rajput Reacts On Talking ABout Her Corona Tests

కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు పాయల్ అరిచింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది. అయితే ఆమె ఏ ఉద్దేశ్యంతో షేర్ చేసిందో గానీ.. ఆ వీడియోను, పాయల్‌ను తెగ ట్రోల్ చేశారు. రూపాయికి వంద రూపాయల యాక్షన్ చేస్తున్నావ్.. నీ ఎక్స్‌ట్రాలు ఆపు.. దానికి కూడా ఓవర్ యాక్షన్ అవసరమా? కావాలనే అతి చేస్తున్నావ్ అంటూ ఇష్టమొచ్చినట్టు దారుణంగా ట్రోలో చేశారు. ఇక దీనిపై ఓ మీడియాతో మాట్లాడుతూ.. వివరణ ఇచ్చింది.

అది నిజమని, కావాలని చేసింది కాదని తెలిపింది. భయం వేసి అలా ఏడ్చానని, తాను అలా బాధపడుతుంటే ట్రోలింగ్ చేయడం దారుణమని విలపించింది. సూది, ఇంజక్షన్‌లను చూసి భయపడటం ట్రైపానోఫోబియా అని చెబుతూ.. అది ఎవ్వరికైనా ఉంటుంది అది సాధారణమే అని తెలుపుతూ ఎదుటి వారిని జడ్జ్ చేయడం ఆపండి అంటూ పాయల్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. అంటే ఈ ట్రోలింగ్‌కు పాయల్ పాప బాగానే హర్ట్ అయినట్టుంది.