ఇండస్ట్రీ టాక్ : మహేష్ కన్నా ఓరోజు ముందే పవన్.?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఇద్దరే.. తమ సిన్మాలు వచ్చాయి అంటే పాత రికార్డులు బద్దలు కావాల్సిందే. మరి ఈ రేంజ్ స్టార్డం ఉన్న ఇద్దరు హీరోలు తమ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్ అయితే దర్శకుడు త్రివిక్రమ్ తో తన కెరీర్ లో 28వ సినిమా చేస్తుండగా ఇది సుమారు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక పవన్ అయితే దర్శకుడు క్రిష్ తో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తుండగా ఇది కూడా 150 నుంచి 180 కోట్ల మధ్యలో బడ్జెట్ తో తెరకెక్కుతూ పవన్ కెరీర్ లో కాస్ట్లీ సినిమాగా రూపొందుతుంది.

ఇక ఈ రెండు సినిమాలు షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉండగా లేటెస్ట్ గా అయితే మహేష్ సినిమా రెండో షెడ్యూల్ ఈ జనవరి 18 నుంచి స్టార్ట్ కానున్నట్టుగా సమాచారం బయటకి వచ్చింది. అయితే దీనికి ఓ రోజు ముందే పవన్ అయితే హరిహర వీరమల్లు స్టార్ట్ చేయనున్నాడట.

మరి ఈ షెడ్యూల్ ఈ జనవరి 17 నుంచే మొదలు కానుంది. దీనితో ఇలా మహేష్ కన్నా ఓరోజు ముందే పవన్ స్టార్ట్ చేయనున్నాడు. మరి మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.