రీమేక్ తో పాన్ ఇండియా రికార్డ్స్ కొట్టడం ఏంటి “బ్రో”..

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ కోసం అందరికీ తెలిసిందే. తన కెరీర్ మొదటి నుంచి కూడా ఇప్పటికీ భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్న పవన్ ఇపుడు తన ఫిలిం కెరీర్ లో అయితే అదిరే పీక్ లో ఇప్పుడు తాను ఉన్నాడు.

మరి పవన్ సినిమాలు పరంగా అతి పెద్ద డిజప్పాయింటింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే అది తన రీమేక్ సినిమాలే అని చెప్పాలి. కాగా పవన్ అయితే ఇన్నాళ్లు అయినా రీమేక్స్ ఆపద లేదు కానీ ఇదే రీమేక్ తో పవన్ పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తాజాగా దర్శకుడు సముద్రఖని తో అయితే “బ్రో” అనే సినిమా పవన్ చేస్తున్నాడు.

అది కూడా ఈ సినిమాలో తాను గెస్ట్ రోల్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి నిన్ననే మేకర్స్ ఓ మోషన్ పోస్టర్ తో కూడిన టీజర్ ని రిలీజ్ చేయగా ఈ టీజర్ కి పాన్ ఇండియా టీజర్స్ కన్నా ఎక్కువ రెస్పాన్స్ రావడం విశేషం. కాగా బ్రో మోషన్ పోస్టర్ అయితే 24 గంటలు పూర్తి కాకుండానే 5 మిలియన్ వ్యూస్ అందుకుంది.

దీనితో దీనికి ముందు అయితే RRR మోషన్ పోస్టర్ 4.5 మిలియన్ వ్యూస్ అలాగే రాధే శ్యామ్ చిత్రం మోషన్ పోస్టర్ టీజర్ 4.75 మిలియన్ వ్యూస్ అందుకోగా వీటి లైఫ్ టైం రికార్డ్స్ ని “బ్రో” పవన్ కళ్యాణ్ సింపుల్ గా సోలో గా బ్రేక్ చేసి కొత్త రికార్డు సెట్ చేసాడు.

దీనితో ఈ ఆల్ టైం రికార్డు రెస్పాన్స్ తో అయితే చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ అవైటెడ్ సినిమా అయితే ఈ జూలై 28న రిలీజ్ కాబోతుంది.