టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈరోజు రావడంతో ఫ్యాన్స్ అయితే నిన్న సాయంత్రం నుంచే సోషల్ మీడియాలో హంగామా స్టార్ట్ చేయగా ఈ సమయంలో పవన్ నటిస్తున్న పలు చిత్రాలు నుంచి అదిరే అప్డేట్ లు అయితే ఒకదాని తర్వాత ఒకటి లాక్ అయ్యాయి.
కాగా ఈ చిత్రాల్లో అయితే అనూహ్యంగా ఓ కొత్త ప్రాజెక్ట్ సైలెంట్ గా స్టార్ట్ అయిపోవడం విశేషంగా మారింది. కాగా ఆ చిత్రమే గత రెండేళ్ల కితమే అనౌన్స్ అయ్యిన చిత్రం. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి అలాగే నిర్మాత రామ్ తాళ్లూరి కాంబినేషన్ లో అనౌన్స్ అయ్యిన ఈ చిత్రం నిలిచిపోయింది అని కూడా టాక్ వచ్చింది.
కానీ ఈ చిత్రం విషయంలో మేకర్స్ షాకింగ్ ట్విస్ట్ అయితే ఇచ్చారు. మరి ఈ చిత్రంకి కొత్త ఆఫీస్ ని కూడా ఓపెన్ చేసి తాము సినిమా స్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్ట్ అయితే మాసివ్ బడ్జెట్ స్కేల్ లో అయితే తెరకెక్కిస్తున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.
అలానే ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అయితే ఈ సినిమాకి కథ అందిస్తుండగా మొత్తం ముగ్గురూ వక్కంతం వంశీ దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు నిర్మాత రామ్ తాళ్లూరి కూడా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తుంది. కాగా వచ్చే ఏడాదిలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానున్నట్టుగా టాక్.