ఇండస్ట్రీ టాక్ : పవన్ సినిమా దానికి రీమేకే అట.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో కొన్ని స్ట్రైట్ సినిమాలతో పాటుగా కొన్ని రీమేక్ లు కూడా ఉన్నాయి. అయితే ఈ రీమేక్ లతో ఫ్యాన్స్ విస్తుపోతున్నారు కానీ పవన్ మాత్రం ఆపట్లేదు. రీసెంట్ గానే రెండు భారీ సినిమాలు కూడా అనౌన్స్ చేశారు.

అయితే ఈ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేయనున్న చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. అయితే ఈ సినిమా మొదట భవదీయుడు భగత్ సింగ్ కి వేరే వెర్షన్ లా ఉంటుంది అని చెప్పారు. మరి దీని తర్వాత ఇది కూడా రీమేక్ సినిమానే అని బజ్ రావడం పవన్ ఫాన్స్ చిర్రెత్తుకొచుంది.

దీనితో భారీ ట్రెండ్ కూడా చేయగా అప్పటికి ఎదో చిన్న సర్ది చెప్పారు కానీ ఇప్పుడు దీనిపై ఇండస్ట్రీ వర్గాల నుంచి లేటెస్ట్ సమాచారం వస్తుంది. దీనితో అయితే ఈ చిత్రం అనుకున్నట్టు గానే తమిళ సినిమా తేరి కి రీమేక్ గానే ఉంటుందట. మరి ఈ సినిమా ఆల్రెడీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.

అలాంటిది మళ్ళీ అందులోని పవన్ లాంటి హీరోతో చేయడం అనేది వెర్రితనం. ఒకవేళ చేసినా ఓపెనింగ్స్ అయితే వస్తాయి కానీ సినిమా బిజినెస్ కి తగ్గ లాభాలు రావని చెప్పాలి. అయితే ఈ సినిమా నుంచి ఆల్రెడీ పూజా హెగ్డే కూడా బయటకి వచ్చేసినట్టు రూమర్స్ ఉన్నాయి. కానీ సంగీతం అయితే దేవిశ్రీ ప్రసాద్ నే అందిస్తుండగా మైత్రి మేకర్స్ వాళ్ళే నిర్మాణం వహిస్తున్నారు.