మెగా టాక్ : “బ్రో”లో పవన్ కనపడేది ఎంతసేపంటే.!

ఇప్పుడు టాలీవుడ్ లో రాబోతున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం అయితే “బ్రో”. గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. అయితే ఓ డివోషనల్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వస్తున్నా ఈ సినిమాపై అయితే మంచి అంచనాలు రావడానికి యూనానిమస్ కారణం పవర్ స్టార్ అనే చెప్పడంలో సందేహం లేదు.

దీనితో నైజాం లో ఆల్రెడీ భారీ బిజినెస్ ని కంప్లీట్ చేసుకున్న ఏఈ చిత్రంపై ఇపుడు ఇంట్రెస్టింగ్ సమాచారం మెగా వర్గాలు నుంచి వినిపిస్తుంది. కాగా ఈ చిత్రంలో అయితే పవన్ సుమారుగా గంటన్నర సేపు డెఫినెట్ గా కనిపిస్తాడట. ఈ సినిమా అంతా రెండు గంటల 10 లేదా 20 నిమిషాలు ఉంటే అందులో పవన్ 90 నిమిషాలకి పైగా కనిపిస్తాడని మెగా వర్గాలు చెప్తున్నాయి.

దీనితో అయితే పవన్ ఫ్యాన్స్ కి ఎలాంటి డోకా లేదని చెప్పొచ్చు. బహుశా ఇందుకే సినిమా బిజినెస్ కూడా బాగా జరుగుతుంది అని సమాచారం. కాగా ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే ని అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే పీపుల్ మీడియా నిర్మాణం సంస్థ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 28న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం సినిమా నుంచి ఒకో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.