Pawan Kalyan : హరిహర వీరమల్లు రెమ్యునరేషన్ వదులుకున్న పవన్ కళ్యాణ్.. కారణం ఇదే..!

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు.. ఈ సినిమా షురూ అయినది దాదాపు అయిదేళ్ల క్రితమే. అయితే, మధ్యలో పవన్ రాజకీయ బిజీతో పాటు పలు ఇతర కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. పలు మార్లు వేసిన సెట్లు మళ్లీ వేయాల్సి రావడం, మొదట హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన షూటింగ్ తర్వాత మంగళగిరికి మారడం, షూటింగ్ ఆలస్యం కావడంతో ఫైనాన్స్‌పై వడ్డీలు పెరగడం, మొత్తం మీద బడ్జెట్ భారీగా పెరగడంతో నిర్మాతకి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన పెద్ద మనసు చూపించారు. ఈ సినిమా కోసం ఆయన గతంలోనే రూ.11 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారు.. తక్కువ పారితోషికం తీసుకోవడమే కాకుండా, నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసిన వెంటనే ఆ అడ్వాన్స్ మొత్తాన్ని కూడా తిరిగి ఇచ్చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
అంటే, హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ ఏ రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా పని చేసినట్లయింది. సినిమా విడుదలయ్యాక నిర్మాతకు లాభాలు వస్తే అప్పుడే తన రెమ్యునరేషన్ గురించి ఆలోచించమని చెప్పాడట పవన్.

ఇప్పటికే జూన్ 12న గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమైన ఈ చిత్రం కోసం ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇలా నిర్మాతకు అండగా నిలవడం, ఆర్థిక భారం తగ్గించేందుకు ముందుకొచ్చిన తీరు నిజంగా శుభ పరిమాణం. అభిమానులు మాత్రం ఆయనని మళ్లీ పెద్ద స్క్రీన్‌పై చూడబోతున్నందుకు ఆనందంతో మురిసిపోతున్నారు.