పవన్ కళ్యాణ్ – రానా ల కి హీరోయిన్స్ ఫిక్స్ ..?

పవన్ కళ్యాణ్ – రానా కలిసి నటించబోతున్న లేటెస్ట్ సినిమా 2021 జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాలో రానా నటిస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా వెల్లడించారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుండగా మలయాళ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కి తెలుగు రీమేక్ గా నిర్మిస్తున్నారు.

Tollywood: Pawan Kalyan wants to remake this Malayalam film in Telugu

కాగా రీసెంట్ గా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో బిజూ మీనన్ పోషించిన నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా… పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో రానా నటిస్తున్నాడు. హీరోల విషయంలోనే కాదు మిగతా పాత్రలని ఫైనల్ చేస్తున్న మేకర్స్ అందరూ పాపులర్ నటీ నటులనే ఎంచుకుంటున్నారట. ఈ క్రమంలోనే రానా తండ్రి పాత్రను దర్శకుడు, నటుడు సముద్ర ఖని నటించబోతున్నట్టు తెలుస్తోంది.

Sai Pallavi Refuses To Promote 2 Crore Worth Fairness Cream Deal; Guess Who  Took It Up? | JFW Just for women

కాగా తాజా సమాచారం ప్రకారం పవన్ – రానా లకు జంటగా నటించబోయే హీరోయిన్స్ ని కూడా మేకర్స్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఆ ఇద్దరు హీరోయిన్స్ ని అధికారకంగా ప్రకటించనున్నారట. ఇక ఆ ఇద్దరు హీరోయిన్స్ లో పవన్ కళ్యాణ్ కి జంటగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కాగా రానా కి జంటగా ఐశ్వర్య రాజేష్ నటించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.