వైరల్ : లగ్జరీ బైక్ తో “వీరమల్లు” సెట్స్ లో ఆశ్చర్యపరిచిన పవన్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు అలాగే రాజకీయాల్లో చాలా యాక్టీవ్ గా పాల్గొంటూ రెండిట్లో కూడా చురుగ్గా కనిపిస్తున్నాడు. ఇక సినిమాల్లో అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా భారీ సినిమా “హరిహర వీరమల్లు” మీదే పెట్టగా ఇప్పుడు ఈ షూటింగ్ లో అయితే పవన్ పాల్గొంటున్నాడు.

అయితే లేటెస్ట్ గా హరిహర వీరమల్లు సెట్స్ నుంచి అయితే పవన్ ఆ సినిమా గెటప్ లోనే ఉండి ఓ లగ్జరీ బైక్ పై కనిపించడం కొన్ని ఫొటోస్ తో యిట్టే వైరల్ అయిపొయింది. దాదాపు 3 లక్షలకి పైగా ఖరీదు చేసే బి ఎం డబ్ల్యూ కొత్త వెర్షన్ బైక్ ని పవన్ హరిహర వీరమల్లు సెట్స్ లో నడుపుతూ కనిపించడం వెరీ స్టైలిష్ గా అయితే మారింది.

దీనితో ఈ వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు గట్టిగా హల్ చల్ చేస్తున్నాయి. చాలా సినిమాల్లో పవన్ బైక్ కలెక్షన్ చూసాము. కానీ ఎక్కువ బుల్లెట్ తరహా బైక్ నడుపుతూ కనిపించే పవన్ ఇప్పుడు వీరమల్లు గెటప్ లో ఓ స్టైలిష్ బైక్ నడుపుతూ కనిపించడం మరింత స్టయిల్ గా కనిపిస్తుంది.

దీనితో ఇందుకే సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇంకా ఈ సినిమాలో అయితే నిధి అగర్వాల్ నటిస్తుండగా దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.