ఇండస్ట్రీ టాక్ : పవన్ లుక్ ఎందుకు మార్చాడో తెలిసిపోయింది.!

pawan_kalyan_new_look_03

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాల్లో ప్రస్తుతం సెట్స్ మీద ఉండి ఆల్రెడీ చాలా మేర షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం లో ఇటీవలే ఓ భారీ ఏక్షన్ షెడ్యూల్ ని అయితే చిత్ర యూనిట్ కంప్లీట్ చేయగా..

గత కొన్ని రోజులు వరకు పవన్ హరిహర వీరమల్లు సినిమా గెటప్ లోనే అంటే లాంగ్ హెయిర్ మరియు కోర మీసం తో కనిపించనున్నాడు. ఇక దీని తర్వాత అయితే పవన్ తన రాజకీయ మీటింగ్ కి గాను హాజరు కాగా అందులో నార్మల్ లుక్ కి అయితే పవన్ వచ్చేసాడు.

హెయిర్ కట్ చేయించి మీస కట్టు కూడా తీసేయడం జరిగింది. మరి ఇంత చేంజ్ ఎందుకో ఇపుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి క్లారిటీ వచ్చింది. పవన్ ఇప్పుడు మరో సినిమా ఓకే చేయగా ఆ రీమేక్ కోసం అయితే పవన్ తన లుక్ మార్చినట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రం షూటింగ్ కోసమే పవన్ లుక్ మార్చినట్టుగా తెలుస్తుంది.

ఆ సినిమా అయితే తమిళ చిత్రం వినోదయ సీతం కాగా ఈ చిత్రం కోసమే పవన్ మారినట్టుగా లేటెస్ట్ సమాచారం. ఇక మరో అప్డేట్ ఏమిటంటే ఈ సినిమా ఈ జనవరి 27 నుంచి స్టార్ట్ కానుండగా ఇందులో పవన్ కూడా హాజరు కానున్నాడట. ఇంకా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెయిన్ హీరోగా నటిస్తుండగా పవన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు.