పరుగులు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్.!

రాజకీయ తెరపై నుంచి సినిమా తెర వైపు కాసేపు.. సినిమా తెర నుంచి రాజకీయ తెరపై కాసేపు.. షిఫ్ట్ అవుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఇప్పుడయితే రాజకీయాల కంటే ఎక్కువగా సినిమాల పైనే ఫోకస్ పెట్టారాయన. ఓ వైపు షూటింగ్స్ జరుగుతున్నాయ్. మరోవైపు షూటింగ్ స్పాట్ నుంచే కొన్ని ఇంపార్టెంట్ పొలిటికల్ డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.

Read More – ముంబైలో అల్లు అర్జున్ ఈ డైరెక్టర్ తో మంతనాలు??

అంతా సాఫీగానే జరుగుతున్నప్పటికీ, నిర్మాతల్లో డైరెక్టర్లలో కొంత హైరానా నడుస్తోంది. ఎప్పటికప్పుడు నిర్మాతల్లో అయితే టెన్షన్ వాతావరణం కనిపిస్తోందని చెప్పక తప్పడం లేదు.

ఈ హైరానా, టెన్షన్స్ వల్ల సినిమాలో క్వాలిటీ మిస్ అవుతుందంటూ కొన్ని వర్గాల అభిమానుల నుంచి ఆందోళన వినిపిస్తోంది. ‘బ్రో’ విషయంలో అది పక్కాగా కనిపించింది. ప్రస్తుతం ‘ఓజీ’ షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్.

ఈ సినిమా విషయంలో ఇవే రూమర్లు వినిపిస్తున్నాయ్. ఇంత తక్కువ టైమ్‌లో అనుకున్న క్వాలిటీ ఆఫ్ కంటెంట్ తీసుకోగలరా.? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో సమాధానమిచ్చి వారి నోర్లు మూయించే ప్రయత్నం చేశారు తాజాగా సోషల్ మీడియా వేదికగా.!

Read More – జనసేనాని సినిమాటిక్ వ్యూహాత్మక మౌనం.!