తమిళ స్టార్ కోసం పవర్ స్టార్ ని తీసుకొస్తారా.?

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు తమిళ దర్శకులతో తమిళ హీరోలు మన తెలుగు హీరోలతో పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ ఓ మాసివ్ ప్రాజెక్ట్ చేస్తుండగా ఆల్రెడీ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసాడు. ఇక మరో దర్శకుడు వెంకీ అట్లూరి తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో “వాథి” అనే సినిమా చేసాడు.

ఇది తెలుగులో “సార్” పేరిట రిలీజ్ కాబోతుంది. కాగా ఇటీవల తమిళ్ లో గ్రాండ్ ఆడియో ఫంక్షన్ జరుపుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ లతో వస్తుంది. మరి ఈ సినిమా కి పవన్ కి బాగా దగ్గర నిర్మాతలు అయినటువంటి హారికా హాసిని ప్రొడక్షన్స్ అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు..

అందులోని పవన్ తో భీమ్లా నాయక్ సినిమా చేసిన నిర్మాణ సంస్థే కావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధనుష్ కోసం వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ సినీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఆల్రెడీ పవన్ ని ఈ ఈవెంట్ కి పిలవగా తాను ఓకే చెప్పినట్టుగానే అంటున్నారు.

మరి నిజంగానే పవన్ ధనుష్ కోసం వస్తున్నాడా లేదా అనేది తెలియాలి. ధనుష్ ఆల్రెడీ పవన్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. మరి ఈ ఇంట్రెస్టింగ్ కలయిక అయితే అవుతుందో లేదో చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో భీమ్లా నాయక్ ఫేమ్ నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇలా కూడా పవన్ ఈ ఈవెంట్ కి వచ్చే ఛాన్స్ లేకపోవడం లేదని చెప్పొచ్చు.