పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే వున్నాయ్. కానీ, పవన్ దగ్గర టైమ్ మాత్రం చాలా తక్కువ వుంది. ఎలక్షన్స్‌కి ముందే ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేయాల్సి వుంది. అందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ‘ఓజీ’.. చిత్రాలు కూడా వున్నాయ్.
అయితే, ఈ రెండిట్లో ఏది ముందు.? అనే తర్జన భర్జనలు నడుస్తున్నాయ్. ఎంత అనుకున్నా పవన్ కేటాయించే డేట్లలో సినిమాలు పూర్తి చేయడం అంత ఈజీ కాదు. దాంతో, హరీష్ శంకర్ వెనక్కి తగ్గక తప్పేలా లేదట. మరో డైరెక్టర్ సుజిత్.. హరీష్ శంకర్‌తో పోల్చితే, సుజిత్ కాస్త వేగంగా సినిమా పూర్తి చేసేస్తానంటున్నాడట.
అలా ఈ ఇద్దరిలో ఎవరు వేగంగా సినిమా తీస్తారన్నదానిపై ఇంకా చర్చోపచర్చలు జరుగుతున్నాయట. అయితే, హరీష్ కూడా వేగంగానే పూర్తి చేసెయ్యగలడు.! కానీ, పవన్ ఓటు మాత్రం సుజీత్‌కేనని తెలుస్తోంది. సో, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కాస్త వెనక్కి వెళ్ళొచ్చుననీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. చూడాలి మరి. ఏం జరుగుతుందో.!