పవన్ కి అయోధ్య ఆహ్వానం..పప్పులో కాలేసిన ఫ్యాన్స్?

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కంటే ఇప్పుడు పొలిటీషియన్ గానే ఎక్కువ బిజీగా కనపడుతున్నాడు అని చెప్పాలి. కాగా ఇప్పుడు పవన్ చేస్తున్న అన్ని సినిమాలు కూడా బ్రేక్ పడి షెడ్ లో ఉన్నాయి అలాగని పవన్ రోజు బయట రాజకీయాల్లో కనిపించడం లేదు.

ఇక ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ కి భారతదేశ ప్రతిష్టాత్మక దేవాలయం అయోధ్య నుంచి ఆహ్వానం వచ్చినట్టుగా నిన్ననే జనసేన పార్టీ వారు తెలిపారు. బహుశా ఇది మన టాలీవుడ్ హీరోస్ లోనే మొదటి వ్యక్తికి ఆహ్వానం అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ లకి కూడా ఆహ్వానం వస్తుంది అని కొన్ని రూమర్స్ వచ్చాయి.

కానీ అఫీషియల్ గా అయితే పవన్ కి ఆహ్వానం వచ్చినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఇక్కడ పవన్ కూడా ఏమి టాలీవుడ్ ఫస్ట్ హీరో లెక్క లోకి రాడు ఎందుకంటే ఇండియా వైడ్ గా అనేక మంది రాజకీయ నాయకులకి కూడా ఆహ్వానాలు వెళ్లాయి. సో అలా జనసేన అధినేతగా మాత్రమే పవన్ కి ఆహ్వానం వచ్చినట్టుగా తెలుస్తుంది.

కానీ దీన్ని కాస్త పవన్ అత్యుత్సాహ ఫ్యాన్స్ కొందరు తమ హీరోనే మొదటగా టాలీవుడ్ నుంచి పిలిచారు అంటూ సోషల్ మీడియాలో డప్పు కొట్టుకుంటున్నారు. కానీ అసలు మేటర్ మాత్రం ఇది. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూడు సినిమాలు చేస్తుండగా ఈ ఏడాదిలోనే ఈ చిత్రాలు షూట్ స్టార్ట్ అవుతాయని ఒకటి లేదా రెండు రిలీజ్ లు ఉంటాయని సినీ వర్గాల్లో టాక్.