“తొలిప్రేమ” రీరిలీజ్ బాయ్ కాట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చిత్రాల్లో తన కెరీర్ స్టార్టింగ్ లోనే వరుస భారీ హిట్స్, ఇండస్ట్రీ హిట్ లు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో కొన్ని పథ చిత్రాలు అయితే రీసెంట్ ట్రెండ్ లో భాగంగా రీ రిలీజ్ లు చేస్తున్నారు. అయితే ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా తన ఎపిక్ లవ్ స్టోరీ క్లాసిక్ హిట్ చిత్రం “తొలిప్రేమ” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించగా ఈరోజు ఈ సినిమా రీ రిలీజ్ అంటూ అనౌన్సమెంట్ అయితే వచ్చింది. కాగా ఈ రీ రిలీజ్ ని ఈ జూన్ 30కి ఫిక్స్ చేయగా ఈ రీ రిలీజ్ విషయంలో మాత్రం పవన్ ఫ్యాన్స్ తమ స్టాండ్ చెప్తున్నారు. సోషల్ మీడియాలో అధికారిక ఫ్యాన్ హ్యాండిల్స్ వారు అయితే తొలిప్రేమ రీ రిలీజ్ కి ఎవరూ చూడొద్దు అంటూ మనవి చేసుకుంటున్నారు.

కేవలం ఏ రీ రిలీజ్ కు అయితే పవన్ జనసేన పార్టీ కి ఉపయోగపడతాయో ఆ రీ రిలీజ్ లను మాత్రమే ఎంకరేజ్ చెయ్యాలి అని ఫ్యాన్స్ ఎమోషన్స్ తో క్యాష్ చేసుకునే వారి రీ రిలీజ్ లను మాత్రం ఎంకరేజ్ చేయొద్దు అంటూ తొలిప్రేమ రీ రిలీజ్ పై చెప్పారు.

ఇప్పటివరకు పవన్ సిన్మాలు జల్సా, ఖుషి చిత్రాలు రీ రిలీజ్ డబ్బులు జనసేన పార్టీకి అందించారు అనే కాజ్ తో వాటి కోసం ప్రచారం చేసాం తప్ప ఇప్పుడు తొలిప్రేమ రీ రిలీజ్ కి సంబంధం లేదు అలాగే పవన్ పార్టీ కి ఉపయోగపడని కేవలం డబ్బులు కోసం చూసే ఈ రీ రిలీజ్ ని ఎంకరేజ్ చెయ్యొద్దని చెప్పేస్తున్నారు. మరి గతంలో కూడా సరిగ్గా జల్సా సమయంలో “తమ్ముడు” రీ రిలీజ్ అయ్యింది. మరి తొలిప్రేమ విషయంలో ఏమవుతుందో చూడాలి.