టాలీవుడ్ సినిమా దగ్గర గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తెలియని వారు ఉండరు. మరి తన పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెలిసిందే. ముగ్గురి భార్యలు ఉండగా ఇద్దరికీ విడాకులు ఇచ్చేసి పవన్ ఇపుడు మూడో భార్యతో ఉన్నారు. అలాగే రెండో భార్య రేణు దేశాయ్ విషయంలో అయితే ఇప్పటికీ మాత్రం ఏదొక చిన్న అంశం కాంట్రవర్సీగా మారుతూ ఉంటుంది.
అలాగే చాలా సార్లు ఆమె పవన్ ఫ్యాన్స్ విషయంలో కూడా అసహనం వ్యక్తం చేసింది. కానీ ఈసారి మాత్రం పవన్ ఫ్యాన్స్ విషయంలో తప్పు లేకపోయినప్పటికీ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టే ఉందని చెప్పాలి. కాగా లేటెస్ట్ గా అకిరా నందన్ తో ఓ వీడియో పోస్ట్ చేయగా అందులో పవన్ ఫ్యాన్ మా అన్న కొడుకు అకిరా ని ఎందుకు దాచేస్తున్నారు రేణు గారు అంటూ చాలా గౌరవప్రదంగానే మాట్లాడాడు కానీ దానికి రేణు దేశాయ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యిపోయారు.
మీ అన్న కొడుకు ఏంటి అకిరా నా కొడుకు ఇంకోసారి ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేయొద్దు అంటూ ఓ రేంజ్ లో మండిపడ్డారు. అయితే ఈ ఇష్యూ బాగా రైజ్ అయ్యిన తర్వాత పవన్ ఫ్యాన్స్ నిజంగానే సదరు అభిమాని రేణు దేశాయ్ విషయంలో ఏమన్నా తప్పుగా మాట్లాడాడా అని చూస్తే అందులో ఎలాంటి తప్పు వారికి కనపడలేదు. దీనితో అసలు అందులో తప్పేం ఉంది అని ఈ ఒక్క అంశం విషయంలో పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ పట్ల మొదటిసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
#RenuDesai on Instagram !! pic.twitter.com/1U4fmsqJZ4
— OverSeasRights.Com (@Overseasrights) April 8, 2023