ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర చాలా మంచి వాతావరణం కనిపిస్తుందని చెప్పాలి. అయితే ముఖ్యంగా తెలుగు సినిమా మరియు హిందీ సినిమా దగ్గర బంధం మరింత గట్టి పడుతూ వస్తుంది. మన మార్కెట్ ఆల్రెడీ హిందీలో పాగా వేయడంతో బాలీవుడ్ హీరోలు వారి మార్కెట్ మళ్ళీ తెలుగులో ఇంకా పెంచి స్టాండర్డ్ చేసుకోవాలని అయితే చర్చించుకుంటున్నారు.
అలాగే కొంతమంది స్టార్స్ అయితే బాహాటంగానే మా హిందీ సినిమాలు తెలుగులో చూడడం తగ్గించేశారని అనేసారు. దీనితో డిఫరెంట్ కాంబినేషన్ లు ఇప్పుడు సెట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మరి అలాగే ఇప్పుడు మన టాలీవుడ్ హీరో పవన్ దర్శకుడు హరీష్ శంకర్ హిందీలో బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేయించడానికి ఓకే చెప్పించుకున్నాడని క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది.
మరి ఈ న్యూస్ మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే గత కొన్ని నెలల కితమే సల్మాన్ ని హరీష్ శంకర్ కలవడం జరిగింది. అప్పుడు సినిమా కోసమే అని టాక్ రాగా ఫైనల్ గా ఈ చర్చలు ఫలించి హరీష్ మరియు సల్మాన్ ఖాన్ ల నుంచి సినిమా ఓకే ఫైనల్ అయ్యినట్టుగా ఇప్పుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ ని ఓ ప్రముఖ బ్యానర్ హ్యాండిల్ చేయనున్నట్టు వినికిడి..