ఇండస్ట్రీ టాక్ : ఒకే ఆలోచనలో పవన్, మహేష్ లు..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో అయితే టాప్ హీరోలు పోటీ చాలా మందిలో ఉండొచ్చు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ల మధ్య పోటీ మాత్రం ఎవరూ దాటలేనిది అని చెప్పొచ్చు. అలాంటి ఈ ఇద్దరి మధ్య ఏ చిన్న అంశం అయినా కూడా కాస్త దగ్గరగా ఉంటే అది పవన్ మరియు మహేష్ ఫ్యాన్స్ లో మంచి ఎగ్జైట్మెంట్ గా ఉంటుంది.

ఇక ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇద్దరు ఆలోచనలు తమ సినిమాల విషయంలో మాత్రం ఒకేలా కలిసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పవన్ అయితే దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.

మరి ఈ ఇద్దరు కూడా తమ డైరెక్టర్స్ కి కంప్లీట్ డిఫరెంట్ టాస్కులు ఇస్తున్నారు. కథలు అందులో మార్పులు చేసి ఖచ్చితంగా మార్చాల్సిందే అని చెపుతున్నారట. ఆల్రెడీ మహేష్ త్రివిక్రమ్ కి చెప్పగా ఇప్పుడు పవన్ కూడా హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాకి కూడా మార్పులు చేయాల్సిందే అని చెప్పగా..

మళ్ళీ హరీష్ మొత్తం మార్చి ఇప్పుడు “ఉస్తాద్ భగత్ సింగ్” గా మార్చినట్టుగా ఇప్పుడు గాసిప్స్ సినీ వర్గాలు నుంచి వినిపిస్తుంది. మరి మహేష్ అయితే త్రివిక్రమ్ కి చెప్పగా తాను కూడా అనేక మార్పులు చేసినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఇలా ఇద్దరి ఆలోచనలు కలిశాయని చెప్పొచ్చు.