ఇండస్ట్రీ టాక్ : మరోసారి ఆ సాహసం చేయబోతున్న పవన్.!

టాలీవుడ్ లో ఉన్న  అతి తక్కువ మంది హీరోస్ లో టాలెంటెడ్ ఉన్నవారు ఉన్నారు. మరి ఆ హీరోల్లో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. పవన్ హీరోగా, ఓ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా, సింగర్ గా రచయితగా అలాగే దర్శకునిగా కూడా వర్క్ చేసాడు.

అయితే ఇప్పుడు పవన్ హీరోగా మాత్రమే పని చేసుకుంటూ బిజీగా ఉండగా ఇప్పుడు పవన్ అయితే మరోసారి సాహసం చేయనున్నట్టుగా తెలుస్తుంది. పవన్ అయితే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా కోసం రచయితగా మారబోతున్నాడట. రీసెంట్ గా దర్శకుడు హరీష్ శంకర్ తో అయితే తాను సినిమా చేయనుండగా..

ఈ సినిమాకి కథ పవన్ నే అందించనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దీనితో అయితే చాలా కాలం తర్వాత తన సొంత కథతో తాను రాబోతున్నాడని చెప్పాలి. అయితే ఇంతకు ముందు తాను రచయితగా చేసిన సినిమాలకి పెద్ద ట్రాక్ రికార్డు లేదు.

దీనితో ఈ సినిమాకి మళ్ళీ తన కథ తోనే రావడం అంటే సాహసం అనే చెప్పాలి. అలాగే ఈ చిత్రం కూడా అతి త్వరలోనే సినిమా కూడా స్టార్ట్ కానుందట. అలాగే నెక్స్ట్ ఈ సినిమా తర్వాత భవదీయుడు భగత్ సింగ్ ని మేకర్స్ స్టార్ట్ చేయనున్నారట. ఇంకా ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి.