RRR : ఆర్ఆర్ఆర్ కు మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా…విజయేంద్రప్రసాద్ ఏమన్నారు..?

RRR : ఆర్ఆర్ఆర్ గురించి వార్తలు ఇప్పట్లో ఆగేలా లేవు. అటు థియేటర్ల దగ్గర రచ్చ రచ్చ చేస్తోంది ఆర్ఆర్ఆర్. ఇండియా మొత్తం తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతోంది ఆర్ఆర్ఆర్. ఇక ఇందులో నటించిన ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లకు పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టింది ఇక దర్శకధీరుడు రాజమౌళి అయితే క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ ల్లో ఆసక్తికర విషయాలను తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాకోసం ఒక హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అనుకున్నారట. ఇక పవన్ తో సరి సమానమైన క్రేజ్ ఉన్న మరో హీరో లేకపోవడంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను సినిమాను కొనసాగించారట .

పవన్ కళ్యాణ్ గొప్ప స్టార్ అని, ఆయనకున్న క్రేజ్, చరిష్మా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికీ లేదని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు.ఇక ఆర్ఆర్ఆర్ 2 రాబోతోందనే హింట్ కూడా ఇచ్చారు విజయేంద్రప్రసాద్ గారు. దీంతో మళ్ళీ అభిమానుల్లో అనేక చర్చలు మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ 2 ఇలా ఉండబోతోంది రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఎలా వుండబోతున్నాయి మొదటి భాగం లో ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ ఉండటం తో అసంతృప్తితో ఉన్న అభిమానులకు రెండవ భాగం ఊరటనిస్తుందా అనే అంశాలు చర్చకు వస్తున్నాయి కానీ ఆర్ఆర్ఆర్ రెండో భాగం కనుక వస్తే ఇక ఫ్యాన్స్ కు పండగే.