జస్ట్ “బాహుబలి 2” వెనకే “పఠాన్”.!

గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అసలు సిసలైన హిట్ అయితే స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం “పఠాన్” తో తీరింది. బాలీవుడ్ సినిమా ఓ కరెక్ట్ కం బ్యాక్ కోసం చూస్తున్న సమయంలో చాలానే సినిమాలు వచ్చాయి కానీ ఏది కూడా అంత రేంజ్ హిట్ గా నిలవలేదు.

మధ్యలో కొందరి స్టార్ ల సినిమాలు కూడా విఫలమే అయ్యాయి. ఈ సమయంలోనే వచ్చిన అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “పఠాన్”. ఈ సినిమా అనుకోని రీతిలో వండర్స్ నమోదు చేస్తుంది అని ఊహించి ఉండరు. అయితే షారుఖ్ నుంచి కూడా చాలా కాలం గా సరైన హిట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కూడా చాలా కసిగా ఉన్నారు.

దీనితో పాజిటివ్ టాక్ కొద్దిగా రావడంతో పఠాన్ మైండ్ బ్లాకింగ్ వసూళ్లు ఇండియాలో మరియు అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం రికార్డులు నమోదు చేసింది. అయితే ఫైనల్ గా ఈరోజు మాత్రం నార్త్ బెల్ట్ లో పఠాన్ సినిమా ఆల్ టైం టాప్ 2 పొజిషన్ లోకి ఈ సినిమా వచ్చేసింది.

ఇప్పటికవరకు నార్త్ లో బాహుబలి 2 తర్వాత ఉన్న కేజీఎఫ్ 2 సినిమా నిలిచి ఉండగా ఈ సినిమాని ఇప్పుడు పఠాన్ సినిమా దాటేసి టాప్ 2 లోకి వచ్చింది. దీనితో ఇక బాహుబలి 2 వెనుకే ఈ సినిమా ఉన్నట్టుగా బాలీ ట్రేడ్ వర్గాలు వారు అంటున్నారు. బాహుబలి 2 హిందీలో 500 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంది.

ఇప్పుడు పఠాన్ 430 కోట్ల మార్క్ దగ్గర ఉంది. ఇక లైఫ్ టైం లో అయితే పఠాన్ కి బాహుబలి ని కూడా టచ్ చెయ్యడం విషయం కాదని అంటున్నారు. మరి పఠాన్ ఇదే సాధిస్తే ఎన్నో ఏళ్ల నుంచి చెక్కు చెదరని రికార్డు కొట్టేసినట్టే అని చెప్పాలి.