కాలు జారితే కాలం కాటేస్తుందనే సందేశం.. డర్టీహరిపై పరుచూరి కామెంట్స్

Paruchuri Gopala Krishna About Dirty Hari and MS Raju

ఓ చిన్న సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం అంత ఈజీ కాదు. అదే బోల్డ్ కంటెంట్.. మితిమీరిన శృంగార సన్నివేశాలతో నింపేసి టీజర్, ట్రైలర్ లేదా పోస్టర్లతో దడ పుట్టిస్తే ఆసినిమా ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. అలా డర్టీ హరి కూడా జనాల్లో బాగా ఎక్కేసింది. ఎంఎస్ రాజు వంటి గొప్ప నిర్మాత డర్టి హరి వంటి సినిమాను డైరెక్ట్ చేయడమేంటని అంతా అనుకున్నారు. సినిమా ప్రమోషన్ సమయంలోనూ ఎంఎస్ రాజు డర్టి హరి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.

Paruchuri Gopala Krishna About Dirty Hari and MS Raju

ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడు. మనం రోజూ చూసే మనిషి, పైకి కనపడే మనిషి ఒక్కోసారి వేరే రకంగా కనిపిస్తారు. ఆ లోపలి మనిషి ఒక్కోసారి గాడి తప్పి ప్రవర్తించొచ్చు. ఆ యానిమల్ ఇన్స్టింక్ట్ వల్ల చాలా పరిణామాలు సంభవిస్తాయని చెబుతూ.. కెరీర్‌లోనే గొప్ప స్క్రీన్ ప్లే సినిమాగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చాడు. అయితే సినిమా విడుదలయ్యాక డర్టి హరికి మంచి మార్కులే పడ్డాయి కూడా. కానీ బోల్డ్ సీన్స్ శ్రుతిమించాయనే టాక్ కూడా వస్తోంది.

తాజాగా ఈ డర్టీ హరిపై పరుచూరి గోపాలకృష్ణ స్పందించాడు. ‘మా హనీ , మీ ఎం ఎస్ రాజు డర్టీ హారీ చూసాను. మా నిర్మాత ఇంత మంచి రచయితా దర్శకుడైనందుకు చాలా ఆనందంగా వుంది.పోస్టర్ చూసి ఏదో సినిమా అనుకుంటారు.క్లైమాక్స్ యూత్ కి కనువిప్పు.కాలు జారితే కాలం కాటేస్తుందనే మెస్సేజి బాగుంది.ఆల్ ద బెస్ట్ హనీ’ అంటూ ట్వీట్ చేశాడు. డర్టి హరి చిత్రాన్ని నిలబెట్టింది మాత్రం క్లైమాక్స్. చేసిన తప్పును జీవితాంతం మోయడం, చట్టం విధించే శిక్షనుంచి తప్పించుకున్నా చుట్టూ ఉన్న వాళ్లు వేసే శిక్షను జీవితాంతం భరించడం కష్టమన్న సూత్రాన్ని చెప్పాడు.