‘సలార్‌’ కోసం థియేటర్ల వద్ద హంగామా.. రెండోపార్ట్‌ శౌర్యాంగపర్వం అంటూ వెల్లడి!

సినీ ప్రేక్షకుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడిరది. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన సలార్‌ థియేటర్లలోకి వచ్చేసింది. బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దుమ్మురేపుతోంది.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల కావడంతో తొలిరోజే సినిమాను చూసేయాలని థియేటర్లకు ఎగబడ్డారు. థియేటర్ల దగ్గర టపాసులు పేల్చి.. డ్యాన్సులు, డప్పు చప్పుళ్లతో హోరెత్తించారు. ప్రభాస్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం నార్మల్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు..సెలబ్రిటీలు కూడా సినిమా చూడడానికి పోటీపడ్డారు.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సలార్‌ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అర్థరాత్రి నుంచి ప్రీమియర్స్‌, బెనిఫిట్‌ షోలతో థియేటర్లు మార్మోగిపోతున్నాయి. ఈ చిత్రం అంతటా పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులు తీరారు. అయితే ఈ సినిమా ముగింపులో ప్రభాస్‌ అభిమానులకు ఒక సాలిడ్‌ అప్‌డేట్‌ను ఉంచాడు ప్రశాంత్‌ నీల్‌.

ఈ సినిమా క్లైమాక్స్‌ పూర్తయిన అనంతరం.. ఎండ్‌ క్రెడిట్స్‌ వచ్చే ముందు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ఇచ్చాడు ప్రశాంత్‌ నీల్‌. ఈ సినిమా మొదటి పార్ట్‌కు పార్ట్‌ 1 సీజ్‌ అని టైటిల్‌ పెట్టిన ప్రశాంత్‌ ’సలార్‌ పార్ట్‌ 2కు ’శౌర్యాంగ పర్వం అని టైటిల్‌ ఫిక్స్‌ చేశాడు. ప్రాణ స్నేహితులుగా ఉన్న దేవ, వరదలు బద్ద శత్రువులుగా ఎలా మారారో నీల్‌ ఇందులో చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమా 2024 డిసెంబర్‌లో రానున్నట్లు సమాచారం.