“గేమ్ చేంజర్” పక్కా అలాంటి సినిమానే – పాన్ ఇండియా ఫైట్ మాస్టర్స్

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న భారీ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మాసివ్ చిత్రం “గేమ్ చేంజర్” కూడా ఒకటి. కాగా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మళ్ళీ తన వింటేజ్ మార్క్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో అయితే తెరకెక్కుతుంది.

దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొనగా ఈ సినిమా పట్ల ప్రముఖ పాన్ ఇండియా ఫైట్ మాస్టర్స్ అన్బు అరివ్ లు చేస్తున్న కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి. గేమ్ చేంజర్ అనే చిన్న పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ అని శంకర్ గారి రేంజ్ లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని వారు తెలిపారు.

కాగా ఈ కామెంట్స్ ఏమి ఇప్పుడు చేసినవి అయితే కాదు దాదాపు రెండేళ్ల కితం ఎక్కడో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాటలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. కాగా గేమ్ చేంజర్ ఏక్షన్ విషయంలో మాత్రం ఇంకో క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ గా వినిపిస్తుంది. దీనితో ఇన్ని రోజులు శంకర్ సినిమాల్లో పాటలు కంటే కూడా ఈ సినిమాలో ఫైట్ సీన్స్ కోసం కూడా శంకర్ చాలా ఖర్చు పెట్టారని..

శంకర్ డిజైన్ చేయించుకున్న ఒకో ఫైట్ సీక్వెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసారని సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే మెయిన్ గా మోకోబాట్ ఫైట్ సీన్ చాలా హైలైట్ అవుతుంది అని కూడా టాక్ ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో ఏంటో ఇతర డీటెయిల్స్ ముందు ముందు రానున్నాయి.