ఆస్కార్ హడావుడిలో మరోసారి ఆర్ఆర్ఆర్ సందడి

ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఎంత సెన్సెషనల్ సృష్టింస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి రీరిలీజ్ కానుంది. ఎక్కడో కాదు అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా యూఎస్ఏలో మార్చి 3న 200 థియేటర్లలో విడుదల కానుంది. అన్ని చోట్లా ఈ సినిమా తెలుగులోనే విడుదల కాబోతుండటం విశేషం. మార్చి 1న లాస్ ఏంజిల్స్‌ లో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత మార్చి 3న అమెరికా అంతటా ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.

తాజాగా రీ రిలీజ్ కోసం మూవీ యూనిట్ కొత్త ట్రైలర్‌ ను కూడా విడుదల చేయగా… ఈ ట్రైలర్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట అవార్డును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాళ భైరవ పాడారు. అయితే ఆస్కార్ హడావుడిలో చిత్ర యూనిట్ ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ కానుంది.

ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్తో ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25, 2022న ఈ మూవీ విడుదలై… బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషాల్లో విడుదలైన ఈ సినిమా… ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. హాలీవుడ్ దర్శక దిగ్గజాలు సైతం జక్కన్న ప్రతిభను మెచ్చుకుంటున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో స్టీవెన్ స్పిల్‌ బర్గ్‌, క్రిటిక్ ఛాయిస్ అవార్డ్ర్డు వేడుకలో జేమ్స్ కామెరూన్‌ను రాజమౌళితో మాట్లాడారు. ఆయన దర్శక నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. మరింత గొప్పగా చిత్రాలు తెరకెక్కించాలని ఆకాంక్షించిన విషయం తెలిసిందే.