వన్ ప్లస్ వన్.! టాలీవుడ్ ‘అతి’ తెలివి.!

తెలుగు సినీ పరిశ్రమలో ‘అతి తెలివి’ పెరిగిపోతోంది. ‘టిక్కెట్ల ధరలు పెంచాలి మొర్రో..’ అంటూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు సినీ పరిశ్రమ ప్రముఖులు. తీరా టిక్కెట్ల ధరలు పెంచాక, ఆక్యుపెన్సీ పడిపోయింది. పెద్ద సినిమాలకు బాదేస్తున్నారు.. చిన్న సినిమాలకొచ్చేసరికి ఆఫర్లు ప్రకటించుకోవాల్సి వస్తోంది.!

తాజాగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాకి ‘నైబర్ టిక్కెట్ ఫ్రీ’ అనే ఆఫర్ ప్రకటించేశారు. అంటే, ఒక టిక్కెట్ కొంటే, ఇంకో టిక్కెట్ ఫ్రీ అన్నమాట. అదిరిపోయింది కదూ.! ముందు ముందు పెద్ద సినిమాలకూ ఈ కాన్సెప్ట్ వర్కవుట్ చేయాలనే ఆలోచనలో పరిశ్రమ ప్రముఖులున్నారట. అన్నట్టు, ‘పఠాన్’ సినిమాకి కూడా తగ్గింపు టిక్కెట్లను ప్రకటించేశారు.

ఇదంతా ఎందుకు, మళ్ళీ టిక్కెట్ల ధరలు తగ్గించమని ప్రభుత్వాల్ని కోరెయ్యొచ్చు కదా.? సినిమా బావుంటే వన్ ప్లస్ వన్ అయినా వర్కవుట్ అవుతుందేమోగానీ.. సినిమా బాగోకపోతే.. మొత్తంగా ఫ్రీ అన్నా ఉపయోగం వుండదు.