అఫీషియల్ : విజయ్ “లియో” లో కమల్ “విక్రమ్” కనెక్షన్.!

Kamal Haasan Interview

ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలీవుడ్ సినిమా అయితే ఒక దశాబ్ద కాలం కింద ఉన్న పూర్వ వైభవాన్ని వరుస బిగ్ హిట్స్ తో అయితే సొంతం చేసుకొని భారీ కాంట్రిబ్యూషన్ ని అందిస్తుంది. అయితే గత ఏడాది కోలీవుడ్ నుంచి వచ్చిన పలు భారీ హిట్స్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం “విక్రమ్”.

ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా ఎలాంటి హీరోయిన్ లేకుండా దర్శకుడు లోకేష్ కనగ తెరకెక్కించిన ఈ సినిమా ఊహించని రేంజ్ హిట్ అయ్యింది. ఈ సినిమాతోనే మరిన్ని ఇతర సినిమాలు పెద్ద స్టార్స్ కూడా కలిసి కనిపించనున్నారు అనే కనెక్షన్స్ ఓ రేంజ్ లో అయితే హైప్ ని రేపాయి.

కాగా ఇపుడు ఇదే తరహాలో లోకేష్ దళపతి విజయ్ తో “లియో” అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా కూడా లోకేష్ యూనివర్స్ లో విక్రమ్, ఖైదీ సినిమాలకి లింక్ ఉంది అనే టాక్ గట్టిగా ఉండగా లేటెస్ట్ గా అయితే లియో యూనిట్ సభ్యుడు పెట్టిన పోస్ట్ ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది.

కమల్ హాసన్ సినిమా షూట్ లో జాయిన్ కానున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. ఈగల్ వస్తుంది అంటూ కమల్ ని విక్రమ్ సినిమాలో సాంగ్ తో హైలైట్ చేసిన బిట్ తో ఈ సూపర్ క్లారిటీ అయితే తాను అందించాడు. దీనితో ఇలా లియో సినిమాలో ఖచ్చితంగా ఏజెంట్ విక్రమ్ ని మనం తప్పకుండ చూస్తామని చెప్పడంలో సందేహమే లేదు. మొత్తానికి అయితే మూవీ లవర్స్ కావాల్సిన ఫుల్ మీల్స్ ని లోకేష్ కనగ రాజు గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని చెప్పి తీరాలి.