NTR : ఆ పాటతో ఎన్టీఆర్ నటనలో మరో మెట్టు ఎక్కేసాడు…!

 

NTR: మూడేళ్లుగా ఎదురుచూస్తున్న జక్కన్న సినిమా ఆర్ఆర్ఆర్ విడుదలయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించాడు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించారు. ఇక ఎన్టీఆర్ నటన విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ అబ్బురపరిచే నటనతో అందరిని ఫిదా చేశారు.నందమూరి వారసుడు ఎన్టీఆర్ తన ప్రతిభతో ఒక్కోమెట్టు ఎక్కుతూ సినీ పరిశ్రమలో టాప్ హీరో రేంజ్ కి వెళ్ళాడు. ఎంత ఎత్తుకు వెళ్లిన ఒదిగి ఉన్నాడు ఎన్టీఆర్. తన నటనతో డాన్సులతో అందరిని అకట్టుకున్నాడు. ప్రతి సినిమాలోనూ తన నటన ప్రతిభతో సీనియర్ నటులతో పోటీపడుతూ అభిమానులను సంతోషపెడుతున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా లో ఎన్టీఆర్ రామ్చరణ్ ఇద్దరి పాత్రలు చాలా బాగా వచ్చాయి.అయితే కొంతమంది స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంది ఎన్టీఆర్ కు కొద్దిగా తగ్గించారు అన్న వార్తలు వినిపించాయి, కానీ ఈ సినిమాలో ఇద్దరు హీరోల కి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా రెండు పాత్రలకు తగిన ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇద్దరు హీరోలకి స్ట్రాంగ్ లీడ్ రోల్స్ ఇచ్చారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం మరో మెట్టు ఎక్కి తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఒకే ఒక్క పాటతో తనకు తానే హైలెట్ అయిపోయారు ఈ యంగ్ హీరో. కొమరం భీముడో అనే పాటలో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, అతని నటన గురించి ఎంత చెప్పినా తక్కువే సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ పాట ఒకటే మరో ఎత్తు అని చెప్పేలా తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు తారక్.