RRR Movie: ఎన్టీఆర్, తన కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక స్క్రీనింగ్…. ఎక్కడంటే !

RRR Movie: మోస్ట్ అవైటెడ్ చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ ఆర్ ఆర్ మానియానే నడుస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎన్నడూ లేనివిధంగా ఈ సినిమాకి భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేశారు. టికెట్ రేట్లను పెంచినా అభిమానుల ప్రేమను మాత్రం ఎక్కడా ఆపలేకపోయారు. అంత ధర పెట్టినా కొనేందుకు టికెట్స్ దొరకడం లేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో.

ఐతే ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ తాకిడిని దృష్టిలో పెట్టుకొని, యజమానులు స్క్రీన్ కి ముందు భాగంలో కంచెలు ఏర్పాటు చేయడం, మేకులు కొట్టడం చేసిన విషయం తెలిసిందే. ఎవరు ఎన్ని చేసినా తమ అభిమానాన్ని మాత్రం ఎవరూ ఆపలేరు అంటూ వారు స్పష్టం చేస్తున్నారు.

ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ సినిమాను చూసేందుకు ఎన్టీఆర్ రిలీజ్ కి ముందు రోజే రాత్రి, సినిమాని చూసేందుకు మూవీ టీమ్ మెంబర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకోసం ఏఎంబీ మాల్ లో ఒక స్క్రీన్ ను తారక్ తీసుకున్నట్టు సమాచారం. అంతే కాకుండా ఎన్టీఆర్ తో పాటు, అతని ఫ్రెండ్స్, అతని కుటుంబ సభ్యులు కూడా చూసేందుకు ఈ స్క్రీన్ ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఐతే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కలిసి వివిధ రాష్ట్రాల్లో తిరిగి తమ క్రేజ్ ను మరింత పెంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ ద్వారా భారీ హైప్ తీసుకొచ్చిన ఈ చిత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతుందని మూవీ మేకర్స్ మాత్రమే కాదు, మామూలు ప్రేక్షకులు సైతం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.