బన్నీ డేట్ లో ఎన్టీఆర్ “దేవర”?

టాలీవుడ్ సినిమా నుంచి రానున్న చిత్రాల్లో ఈ ఏడాదిలో చాలానే పాన్ ఇండియా సినిమాలు ఆల్రెడీ లాక్ అయ్యి ఉన్నాయి. కాగా ఈ చిత్రాల్లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “దేవర” కూడా ఒకటి.

వీరి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న చిత్రం అలాగే ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా కూడా ఇదే కావడంతో భారీ హైప్ నెలకొంది. ఇక రీసెంట్ గానే వచ్చిన గ్లింప్స్ చూసాక మరిన్ని అంచనాలు పెరుగగా గత కొన్ని రోజులు నుంచి సినిమా వాయిదా అంటూ వార్తలు గట్టిగా స్ప్రెడ్ అవుతున్నాయి.

అయితే ఇప్ప్పుడు దాదాపు దేవర సినిమా ఆగిపోయినట్టే అని వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. మరి ఇప్పుడు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనేది ఆసక్తిగా మారింది. అయితే ఇక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనెక్షన్ మరోసారో వచ్చింది. ఆల్రెడీ ఈ సినిమా కొరటాల శివ అల్లు అర్జున్ తో చేయాల్సింది అని తెలిసిందే.

దానిని ఎన్టీఆర్ చేస్తున్నాడు. కాగా ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 రిలీజ్ డేట్ అంటే ఆగష్టు 15న దేవర సినిమా వస్తుంది అంటూ సరికొత్త పుకారు మొదలైంది. దీనితో ఈ భారీ చిత్రం బన్నీ డేట్ లో వస్తుంది అని అంటున్నారు. ఇక్కడ మరి అల్లు అర్జున్ సినిమా సంగతి ఏంటి అంటే? ఆ సినిమా కూడా వాయిదా పడింది అని తాజా టాక్. ఇలా మొత్తానికి అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో ఒక్కసారిగా మంచి రసవత్తర వాతావరణం నెలకొంది.