మార్కెటింగ్ పాఠాలు నేర్చుకుంటోన్న జూనియర్ ఎన్టీయార్.!

ఎన్టీయార్ 30కి సంబంధించి కొరటాలకు కొన్ని రెస్పాన్సిబులిటీస్ నుంచి ప్రెజర్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడట ఎన్టీయార్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పుణ్యమా అని, రాజమౌళితో ఎక్కువగా ట్రావెల్ చేశాడు జూనియర్ ఎన్టీయార్. ఈ ప్రయాణంలో తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు జక్కన్న నుంచి.

అందులో ముఖ్యంగా మార్కెటింగ్ పాఠాలు నేర్చుకున్నాడట. సినిమాని నేషనల్ రేంజ్‌లో ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో ఎన్టీయార్ తెలుసుకున్నాడట. సహజంగా కొరటాల శివ సినిమాలకి డైరెక్షన్ మాత్రమే కాదు, మార్కెటింగ్ కూడా తానే చూసుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, సర్వం తానే అవుతాడు కొరటాల శివ.

కానీ, ఈ సారి మాత్రం ఎన్టీయార్ చొరవ చేసుకోబోతున్నాడట. డైరెక్షన్ పార్ట్ వరకే కొరటాలకు అప్పగించి, సినిమాని నేషనల్ వైడ్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తాను బాధ్యత తీసుకుంటున్నాడట. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ విషయంలో ఎన్టీయార్‌కి హెల్ప్ చేయబోతున్నాడట. కార్తికేయ స్పెషల్ టీమ్‌తో కలిసి ఈ సినిమాని మార్కెట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.