War 2: వార్ 2: మేకర్స్ పనుల వల్ల ఎన్టీఆర్ సీరియస్.. ఆ సినిమాపై ఎఫెక్ట్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీ డెబ్యూ చిత్రం వార్ 2 పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి తెరపై కనిపించబోతుండటంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్ట్ చర్చనీయాంశంగా మారింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్, స్పై యూనివర్స్‌లో భాగంగా రాబోతోంది. అయితే, షూటింగ్ ఆలస్యం అవుతూ రావడంతో ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్‌పై ప్రభావం పడుతున్నట్లు టాక్.

వాస్తవానికి ఎన్టీఆర్ తన షెడ్యూల్ పూర్తయిన వెంటనే NTR 31 షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందే ఈ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ వార్ 2 షూటింగ్ అనేక మార్పులకు గురవడంతో, ఎన్టీఆర్ తదుపరి సినిమా స్టార్ట్ అయ్యే సమయం నత్తనడకన సాగుతోంది. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్ సన్నివేశాలు పూర్తికావాల్సి ఉండటంతో, ఈ ఆలస్యం మరింతగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక రీసెంట్ ఎన్టీఆర్ మేకర్స్ తో మరోసారి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కొంతవరకు మేకర్స్ పై కోపంగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అనుకున్న ప్లాన్ కంటే ఎక్కువ డేట్స్ అవుతుండడంతో తారక్ గుర్రుగా ఉన్నట్లు లీక్స్ వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తుండటంతో ముంబై, అబుదాబి, లండన్ లాంటి లొకేషన్లలో హాలీవుడ్ టెక్నీషియన్ల సహాయంతో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో విలన్ షేడ్స్ ఉండటంతో బాలీవుడ్ మార్కెట్‌లో అతనికి ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశముందని బీటౌన్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ, చిత్రీకరణలో రీషెడ్యూల్స్, స్క్రిప్ట్ మార్పులు కారణంగా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉంది.

ప్రస్తుతం వార్ 2 2025 చివర్లో లేదా 2026 ఆరంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను అత్యున్నత స్థాయిలో మలచాలని యశ్ రాజ్ ఫిలిమ్స్ భావిస్తుండటంతో ఆలస్యం సహజమన్నా, ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఇది ప్రభావం చూపుతుండటంతో అభిమానుల్లో నిరాశ నెలకొంటోంది. మరి NTR 31 ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

Kiran Royal Lakshmi Controversy : కిరణ్ రాయల్ పై పవన్ సీరియస్ | Pawan Kalyan | Telugu Rajyam