అభిమానితో వీడియో కాల్‌ మాట్లాడిన ఎన్టీఆర్.. క‌లిసి సెల్ఫీ దిగుదాం అని హామీ!

ntr interacted via video call with his die hard fan

అభిమానులే మాకు దేవుళ్లు అనే డైలాగ్ నంద‌మూరి హీరోల నుండి ఎక్కువ‌గా వింటూ ఉంటాం. ముఖ్యంగా జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌లు ఆడియో వేడుక‌ల‌లో త‌మ అభిమానుల‌ని ఉద్దేశించి హార్ట్‌ఫుల్ మాట‌ల‌తో వారి మ‌న‌సుల‌ని దోచుకుంటూ ఉంటారు. అయితే వీరు మాట‌ల్లోనే కాదు చేత‌ల్లోను రియ‌ల్ హీరోలు అని నిరూపించుకుంటూ ఉంటారు. ఆప‌ద వ‌స్తే మేం అండ‌గా ఉన్నాం అనే విష‌యాన్ని గుర్తు చేస్తూ అభిమానుల‌ని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ ఉంటారు. ప‌లు సంద‌ర్భాల‌లో ఆడియో వేడుక‌ల‌కి వ‌చ్చిన అభిమానులు మృత్యువాత ప‌డ‌డంతో చాలా క‌లత చెందారు, క‌న్నీరు కూడా పెట్టుకున్నారు. అందుకే ప్ర‌తీ సారి మీ ఇంట్లో మీ కోసం అమ్మ‌, నాన్న‌, పెళ్ళాం పిల్ల‌లు ఎదురు చూస్తుంటారు. జాగ్ర‌త్త‌గా వెళ్లండి అని చెబుతుంటారు.

ntr interacted via video call with his die hard fan
ntr interacted via video call with his die hard fan

అతి త‌క్కువ వ‌య‌స్సులో స్టార్ స్టేట‌స్ పొందిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న అభిమానుల‌ని ఎంతో ప్రాణంగా ప్రేమిస్తాడు. వారి వ‌ల‌నే తాను ఈ స్థాయికి వ‌చ్చాడ‌నే కృత‌జ్ఞ‌త చాలా ఉంటుంది. అందుకే అభిమానులు ఇబ్బందుల్లో ఉంటే వెంట‌నే రియాక్ట్ అవుతారు. వెంక‌న్న అనే హై హార్డ్ ఫ్యాన్ కొద్ది రోజులుగా కండ‌రాల డిస్ట్రీఫీతో మంచానికే ప‌రిమిత‌మయ్యాడు. ఎన్టీఆర్‌ని క‌ల‌వాల‌ని, అత‌నితో ఓ సెల్ఫీ దిగాల‌ని ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటున్నారు. అయితే ఈ విష‌యం జూనియ‌ర్‌కు తెలియ‌డంతో వెంట‌నే వీడియో కాల్ చేసి వెంక‌న్న‌ను ప్రేమ‌గా ప‌ల‌కరించాడు.

ఎన్టీఆర్‌ని చూసి మైమ‌ర‌చిపోయిన వెంక‌న్న మిమ్మ‌ల్ని ఇలా లైవ్‌లో చూడ‌డం చాలా చాలా ఆనందంగా ఉంది. మీతో ఒక్క సెల్ఫీ దిగాల‌ని ఉంది అన్న‌, అంత‌కు మించి నాకు ఏమోద్దు అన్నాఅని అన్నాడు. దీనికి స్పందించిన ఎన్టీఆర్.. ఇప్పుడు అంతా క‌రోనా గోల ఉంది కదా, ఇది త‌గ్గాక త‌ప్ప‌కుండా నిన్ను పిలిపించుకుంటా అని చెప్పాడు. ఈ ఒక్క మాట చాలు అన్నా, మిమ్మ‌ల్ని క‌లిసేందుకు అయిన నేను బ‌తుకుతా అని వెంక‌న్న ఆనందం వ్య‌క్తం చేశాడు. అప్పుడు ఎన్టీఆర్ అయ్యో!నువ్వు ఎక్క‌డ వెళ‌తాం నేను ఎక్క‌డికి వెళ‌తాం అంద‌రం బాగుంటాం. నువ్వు మంచిగా తిని ఆరోగ్యం బాగా చూసుకో. మీ అమ్మ గారిని బాగా చూసుకో అని స్ప‌ష్టం చేశారు ఎన్టీఆర్.

వెంక‌న్న త‌ల్లితో కూడా మాట్లాడిన ఎన్టీఆర్.. నేను కూడా మీకు అండగా నిలుస్తాను. త‌ప్ప‌క సాయం చేస్తాను అని పేర్కొన్నాడు. ఇక ఎప్పుడెప్పుడు క‌లుస్తామా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నా అని వెంక‌ట‌న్న అన‌గా, దానికి ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే క‌లుస్తాం. నీ ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకో, గాడ్ బ్లెస్ యూ అంటూ ఆశీర్వ‌దించాడు. వెంకన్న అందుకు థ్యాంక్స్ కొమురం బీం అన్న అంటూ త‌న ప్రేమ‌ను చాటాడు. వెంక‌న్న మాట‌కు ఎన్టీఆర్ చిన్న చిరున‌వ్వు చిందించాడు