ఇండియన్ యాక్షన్ సినిమాల ట్రెండ్ మార్చే ప్రయత్నం ఇప్పుడు “వార్ 2” టీజర్‌తో మొదలైంది. యాష్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లు ఒకే ఫ్రేమ్‌లో కనబడటం ఫ్యాన్స్‌కు ఒక సర్ ప్రైజ్ షాక్. ఒకరిని మించి మరొకరు కనిపించేలా ఈ టీజర్ మేకింగ్ ఉత్కంఠ రేకెత్తించింది. వారం రోజులుగా హైప్ పెరిగినట్లే, ఈ టీజర్ దాన్ని ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది.
హృతిక్ రోషన్ కబీర్‌గా తన డాషింగ్ లుక్‌తో మళ్లీ కనిపించగా, ఎన్టీఆర్ స్పై థ్రిల్లర్ యాంగిల్‌లో ఎంట్రీ ఇవ్వడం టీజర్‌కు కొత్తదనాన్ని ఇచ్చింది. ఎన్టీఆర్ డైలాగ్, అంతకుమించిన యాక్షన్ వేర్డ్ ఈ సినిమా కంటెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూపించింది. టీజర్ చివర్లో ఇద్దరి మధ్య క్లోజప్ ఫేస్-ఆఫ్.. నిజంగా థియేటర్‌లో విజిల్స్ వేసేలా చేస్తుంది.
ఎన్టీఆర్ లుక్, బాడీ లాంగ్వేజ్, స్టైల్‌పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు టీజర్‌లోనే తెలుస్తోంది. తాను ఈ సినిమా కోసం పెడుతున్న ప్రిపరేషన్ ఎంత డెడికేటెడ్‌గా ఉందో ఈ ఒక్క టీజర్‌తోనే నెట్టింట్లో హైలైట్ అవుతోంది. హృతిక్‌ను ఢీకొట్టేలా ఒక రా ఏజెంట్‌గా తారక్ నిలిచిన విధానం, తన పాత్రలో ఉండే మానసిక మూడ్‌కీ అద్భుతంగా సరిపడుతోంది.
విజువల్స్, బీజీఎం, కాంబాట్స్ అన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసినట్టే కనిపిస్తోంది. ఫ్రాంచైజీకి కొత్త వైభవాన్ని తీసుకురావాలన్న యష్ రాజ్ లక్ష్యాన్ని టీజర్ న్యాయంగా నెరవేర్చింది. దీన్ని బట్టి చూస్తే, సినిమా టికెట్ ఓపెన్ అవ్వగానే ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్ ఖాయం. ఇప్పుడు “వార్ 2” కేవలం మల్టీస్టారర్ కాదు, నేషనల్ క్రేజ్ కలిగిన ఇద్దరు స్టార్ల కరెక్టర్ క్లాష్‌గా మారింది. టీజర్ ఇచ్చిన స్పీడ్‌ని, సినిమా తెరపై హై వోల్టేజ్ యాక్షన్‌తో మించిన రేంజ్‌కి తీసుకెళ్లగలిగితే, ఇది ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుంది.