ఆ ప్రాజెక్ట్ కంటే ముందే తారక్ మరో సినిమా?

దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న NTR30 ప్రాజెక్ట్‌ మొదటి షెడ్యూల్ ని ఇటీవలే పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత రాబోయే 31వ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ అత్యంత భారీ బడ్జెట్ తో ఆ సినిమాను తెరపైకి తీసుకు రానున్నాడు. ఇక అది ప్రారంభించే ముందు ఎన్టీఆర్ మరో చిత్రం లైన్లోకి వచ్చే ఛాన్స్ ఉందట.

ఎన్టీఆర్ ‘వార్ 2’తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇందులో హృతిక్ రోషన్‌కు ధీటుగా తారక్ ఒక పవర్ఫుల్ నెగెటివ్ క్యారెక్టర్‌ను పోషిస్తాడట. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ ప్రొడక్షన్ ఈ సంవత్సరం చివర్లో ప్రారంభమవుతుంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించిన పనిని ప్రారంభించే ముందు ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ ప్రారంభిస్తారట.

‘సలార్’ విడుదలైన తర్వాత, ఎన్టీఆర్ 31వ స్క్రిప్ట్‌పై పని చేయడానికి నీల్‌కు సమయం కావాలి. ఇక ఇంతలో ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తాడట. ఇక ఎన్టీఆర్ 30వ సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్ కావడానికి ముందు ఎన్టీఆర్ 15 రోజుల గ్యాప్ తీసుకోబోతున్నాడు. ఇక ఆ గ్యాప్ లో అతను హిందీ వార్ 2పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతలతో కూడా చర్చించారు. ఇక అఫీషియల్ గా ఎనౌన్స్ చేయవచ్చని టాక్..