NTR – Prashanth Neel: ఎన్టీఆర్ – నీల్.. ఇంకాస్త ఆలస్యంగానా?

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే విడుదల తేదీ 2026 జానవరి 9 అని ముందుగానే ప్రకటించడంతో, ఆలస్యంపై అనేక ప్రచారాలు మొదలయ్యాయి. సలార్ 2 షూటింగ్ స్టార్ట్ చేశాడనే టాక్ రావడం, అలాగే ఎన్టీఆర్ పూర్తిగా ‘దేవర’ ప్రమోషన్స్, తర్వాత వార్ 2 షూట్‌తో బిజీగా ఉండటంతో డ్రాగన్ ఆలస్యం అవుతుందని సోషల్ మీడియాలో ఓ నెగెటివ్ నేరేషన్ నడుస్తోంది.

అయితే ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ వర్క్ చూసినవాళ్లకు ఇది అసంబద్ధమైన టాక్ అనే చెప్పాలి. కేజీఎఫ్ 2, సలార్ లాంటి సినిమాలు ఎన్నో వాయిదాలు పడినా.. విడుదలయ్యే సమయంలో మాత్రం ఏ మినహాయింపూ లేకుండా థియేటర్‌లో విజువల్ రిచ్ అనుభూతిని ఇచ్చాయి. అలాంటి డైరెక్టర్ బలంగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని, ముందుగా కొన్ని యాక్షన్ పార్ట్స్ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేయడం, షెడ్యూల్ రీడిజైన్ చేయడం అన్నీ ముందస్తు ప్రిపరేషన్స్‌లో భాగమే.

ఈ సినిమాను సులభంగా చేసి రిలీజ్ చేయాలనే ఆలోచన ఏ డైరెక్ట‌ర్‌కి ఉండదు. ఆ హంగామా, గ్రాండ్‌నెస్, బడ్జెట్ పరంగా డ్రాగన్ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్. పైగా ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందన్న టాక్ ఇప్పటికే బయటకు వచ్చింది. హీరో డేట్స్ ఖచ్చితంగా వచ్చాకే లాక్ చేసే డిసిప్లిన్‌తోనే టీం ముందుకెళ్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఆలస్యం అసహనంగా అనిపించవచ్చు కానీ ఫైనల్ ఔట్‌పుట్ బావుంటే మిగతా అన్నీ మర్చిపోతారు.

అందుకే ఇలా అన్నిసార్లు ఆలస్యం అవుతున్నప్పటికీ, పబ్లిసిటీ స్టంట్ అనడానికీ, సినిమా తప్పిదంగా ఉందన్న కామెంట్లకీ ప్రాధాన్యం లేదు. ఇది ఒక స్ట్రాంగ్ బేస్‌తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. ప్రశాంత్ నీల్ మార్కెట్‌కు కావాల్సినంత హైప్ ఒక్క పోస్టర్‌తో వస్తుంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లే సినిమా కావడంతో.. డిలే అయినా ఓకే, కానీ డిల్యూట్ కాకూడదు అన్నదే ఫ్యాన్స్ మూడ్. ఇక మేకర్స్ అయితే అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఆ ప్లాన్ కు తగ్గట్లే షూటింగ్ గ్యాప్ లేకుండా నడుస్తుందో లేదో చూడాలి.