‘ఎన్టీయార్-30’ లీకులు మొదలయ్యాయ్.!

యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమాకి సంబంధించి లీకులు మొదలయ్యాయ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ప్రస్తుతానికైతే ‘ఎన్టీయార్30’ అని వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ‘ఎన్టీయార్30’ కోసం బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్‌ని టాలీవుడ్‌కి తీసుకొస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఆచార్య’ డిజాస్టర్ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివకి ఈ సినిమా సక్సెస్ అత్యవసరం. తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు ఈ సినిమాని పకడ్బందీగా ప్లాన్ చేశాడు కొరటాల శివ. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఆన్ లొకేషన్ ఫొటోస్ లీక్ అవుతున్నాయి.

సినిమా సెట్స్ మీదకు వెళ్ళిందా.? పూర్తిస్థాయిలో సినిమా షూటింగ్ జరుగుతోందా.? వంటి వ్యవహారాలెలా వున్నా, కథ ఇదేనంటూ షూటింగ్ స్పాట్ లొకేషన్స్‌తోపాటుగా సోషల్ మీడియాలో బోల్డన్ని పోస్టింగ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఇవేం లీకులు మహాప్రభో అని.. ‘ఎన్టీయార్ 30’ టీమ్ తలపట్టుకుంటోంది.