ఎన్టీఆర్ 30.. కిక్కిచ్చే ఫైట్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని ఆవిష్కరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ 30లో ప్రతి నాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ మూవీలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. భారీ తారాగణంతోనే ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం విశేషం. ఇక మూవీకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ కూడా తాజాగా పూర్తయినట్లు తెలుస్తోంది.

ఈ సెకండ్ షెడ్యూల్ లో కీలక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారంట. మూవీలో విలన్స్ తో జూనియర్ ఎన్టీఆర్ కుస్తీ పోటీకి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉందంట. భారీ శరీరాలతో ఉన్న విలన్ గ్యాంగ్స్ ని ఈ కుస్తీ పోటీలో జూనియర్ ఎన్టీఆర్ మట్టి కనిపించే సన్నివేశాలు ఫ్యాన్స్ ని విజిల్స్ వేయించే విధంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

ఈ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ఫిక్షనల్ సబ్జెక్టుతో కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ 30 చిత్రాన్ని కొరటాల శివ ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ లో బాలీవుడ్ లో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమా వార్ 2 షూటింగ్ లో తారక్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల మాట. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా పుష్ప 2 సినిమా షూటింగ్ లోకేషన్ కు వెళ్లారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో తారక్ కనిపించబోతున్నారు అనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. ఇక వార్ 2 షూటింగ్ కంప్లీట్ అయ్యాక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్ళనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సలార్ సినిమా రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.