NTR 30: హై రేంజ్ క్యాస్టింగ్!

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోయే ప్యాన్-ఇండియా చిత్రం NTR 30 షూటింగ్ మొత్తానికి ప్రారంభమైంది. ప్రారంభ సన్నివేశాన్ని భారీ బడ్జెట్‌తో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ గా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్‌తో తో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.

ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించనున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మతో సహా ఇతర ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. కేవలం స్టార్ క్యాస్ట్ తోనే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇక పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఈ చిత్రంలో వివిధ పరిశ్రమలకు చెందిన స్టార్ నటీనటులు కనిపిస్తారని, పోస్టర్ల ద్వారా ఒక్కొక్కరిని వెల్లడిస్తారని టాక్ అయితే వస్తోంది.

ఇక యువ సుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 250 కోట్లతో నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొరటాల గత చిత్రం ఆచార్య బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాడని అనిపిస్తోంది.

ఇక కొరటాల శివ కూడా బాగానే ప్రిపేర్ అయ్యాడని, అత్యద్భుతమైన సినిమాని అందించడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. ప్రస్తుత షూట్‌లో అయితే కార్గో షిప్ ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరణ జరుగుతోంది. దీనికి హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన ఓడరేవు సెట్‌తో పాటు హైదరాబాద్, విశాఖపట్నం, గోవా సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగనుంది.